Reading Time: < 1 minute

తాగొచ్చి వేధిస్తుండని భర్తను చంపిన భార్య…పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘటన

Caption of Image.

పెద్దపల్లి, వెలుగు : ప్రతిరోజూ తాగొచ్చి వేధిస్తున్నాడని ఆగ్రహానికి గురైన ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్​నగర్ కు చెందిన గద్దల శ్రీనివాస్​(40), పుష్పలత దంపతులు. మద్యానికి బానిసైన శ్రీనివాస్ రోజూ తాగొచ్చి భార్యను వేధించేవాడు. 

ఈ క్రమంలో మంగళవారం రాత్రి సైతం శ్రీనివాస్​మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను వేధించాడు. దీంతో అసహనానికి లోనైన పుష్పలత కర్రతో శ్రీనివాస్ తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి కళావతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.