Reading Time: < 1 minute
Rana Daggubati Spirit Media Acquires Ameer Log Movie Theatrical Rights

వైవిధ్యమైన కథలతో పాటు వినూత్నమైన కంటెంట్‌ను ఎల్లప్పుడూ ప్రోత్సహించే టాలెంటెడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటికి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అమీర్‌ లోగ్’. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ‘స్పిరిట్ మీడియా’ దక్కించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ గల్లీ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల మధ్య సాగే ప్రయాణం, వారి లైఫ్ స్టోరీ, నేటి యువతకు కనెక్ట్ అయ్యే ఒక మంచి సందేశంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్ర కథాంశం, మేకింగ్ ‘స్పిరిట్ మీడియా’ బృందానికి విపరీతంగా నచ్చడంతో.. ఈ యూత్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను తామే స్వయంగా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. రానా బ్యానర్ సపోర్ట్ లభించడంతో సినిమాపై ట్రేడ్ వర్గాల్లో అప్పుడే అంచనాలు పెరిగాయి.

‘అమీర్ లోగ్’ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ఒక్క అప్‌డేట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో మంచి టాక్ సొంతం చేసుకుంది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని, రీసెంట్‌గా రాకింగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘అవ్వల్ దావత్’ (Avval Dawat) సాంగ్, మరియు ఎనర్జిటిక్ టీజర్ యూత్‌లో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చాయి. ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించగా.. వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా.. ఎస్‌వీకే (SVK) ఫోటోగ్రఫీ, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మరియు గ్రాండ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.