Reading Time: 2 minutes

మేం ఫెయిర్‌గానే గోల్ చేశాం.. థర్డ్ అంపైర్ని ఏకిపారేసిన క్రొయేషియా బ్యూటీ! 

Caption of Image.

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్‌లో పోర్చుగల్ చేతిలో క్రొయేషియా 2–1 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ ఓటమిపై క్రొయేషియాకు చెందిన మోడల్ ఇవానా నోల్ (Knolldoll) సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టొరంటో స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్రొయేషియా కొట్టిన గోల్స్‌ను రెఫరీ తిరస్కరించడంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పరోక్షంగా సెటైర్లు వేసింది.

మేం ఫెయిర్‌గా ఆడాం.. ఇవానా నోల్ ఫైర్: 
గత ఫిఫా ప్రపంచకప్‌లు, ఫార్ములా 1 (F1) లాంటి క్రీడా ఈవెంట్లలో తన గ్లామరస్ అప్పియరెన్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఇవానా నోల్, మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోకు ఆమె పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. నేను క్రొయేషియన్ అయినందుకు ఎంతో గర్వపడుతున్నాను.. మా జట్టు చాలా ఫెయిర్‌గా (న్యాయంగా) ఆడి గోల్స్ సాధించిందని పేర్కొంది. మ్యాచ్ 103వ నిమిషంలో క్రొయేషియా డిఫెండర్ జోస్కో గార్డియోల్ కొట్టిన ఉత్కంఠభరితమైన ఈక్వలైజర్ గోల్‌ను వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) ఆఫ్ సైడ్ అని రద్దు చేయడంపై ఆమె ఈ విధంగా కౌంటర్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో క్రొయేషియా సాధించిన రెండు కీలక గోల్స్ వీఏఆర్ రివ్యూలో రద్దు కావడం గమనార్హం.

►ALSO READ | లవర్‌తో అభిషేక్ శర్మ.. వైభవ్ రీపోస్ట్‌తో నెట్టింట రచ్చ రచ్చ!

గోల్ ఎందుకు రద్దయిందంటే?: 
మ్యాచ్ ముగిసే సమయానికి క్రొయేషియా ప్లేయర్స్ తాము కొట్టిన గోల్‌తో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్తుందని భావించి మైదానంలో సంబరాలు చేసుకున్నారు. అసిస్టెంట్ రెఫరీ కూడా మొదట ఫ్లాగ్‌ను ఎత్తకుండా ఆటను కొనసాగనిచ్చారు. కానీ, ఆ తర్వాత వీఏఆర్ (VAR) అధికారులు ఈ గోల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. పెరిసిచ్ ఇచ్చిన క్రాస్‌ను క్రొయేషియా స్ట్రైకర్ ఇగోర్ మటనోవిచ్ లైట్ గా టచ్ చేశాడని, ఆ తర్వాతి క్షణంలో బంతిని అందుకున్న మారియో పసాలిచ్ ఆఫ్ సైడ్ పొజిషన్‌లో ఉన్నాడని వీఏఆర్ తేల్చింది. ఈ చిన్న కాంటాక్ట్ తోనే ఆ గోల్ రద్దయింది. దీంతో కోపంతో ఊగిపోయిన క్రొయేషియా ఫ్యాన్స్ స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ఇతర వస్తువులని విసిరేశారు.

చరిత్ర సృష్టించిన రొనాల్డో: 
ఈ ఉత్కంఠభరిత పోరులో పోర్చుగల్ 2–1 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లో స్పెయిన్‌తో తలపడేందుకు అర్హత సాధించింది. పోర్చుగల్ తరఫున గొన్కాలో రామోస్ స్టాపేజ్ టైమ్‌లో అదిరిపోయే హెడర్ గోల్ చేయగా, లెజెండరీ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కూడా ఒక గోల్ కొట్టాడు. ఈ గోల్‌తో రొనాల్డో తన ఫుట్‌బాల్ కెరీర్‌లోనే మొట్ట మొదటి వరల్డ్ కప్ నాకౌట్-స్టేజ్ గోల్‌ను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.

 

 

©️ VIL Media Pvt Ltd.