Reading Time: < 1 minute

మీ దగ్గరకే వస్తున్నా.. అక్కడే చర్చిద్దాం : గన్ పార్క్ బయలుదేరిన హరీశ్

Caption of Image.

గురుకులాల్లో అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధం అని.. అక్కడికే వస్తున్నాం అని.. అక్కడే ఉండాలంటూ కాంగ్రెస్ పార్టీ మంత్రులను కోరారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు అయిన తెలంగాణ భవన్ కు వచ్చిన హరీశ్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. గన్ పార్క్ దగ్గర ఉన్న మంత్రులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. అక్కడే అక్కడే ఉండాలని.. అక్కడికి వచ్చిన చర్చిస్తామన్నారు. 

తెలంగాణ భవన్ నుంచి కారులో బయలుదేరిన హరీశ్ ను గేటు దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. గన్ పార్క్ వెళ్లేందుకు హరీశ్ రావు కారును తెలంగాణ భవన్ గేటు దగ్గరే అడ్డుకున్నారు. అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని.. ఈ క్రమంలోనే గన్ పార్క్ వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు. 

©️ VIL Media Pvt Ltd.