
తిమ్మాపూర్, వెలుగు: విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. తిమ్మాపూర్ హామ్లెట్విలేజ్యాదవులపల్లిలో జరుగుతున్న స్కూల్ నిర్మాణ పనులను బుధవారం అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించి సకాలంలో పూర్తి చేయిస్తూ ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని సూచించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, టీజీ ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, అధికారులు ఉన్నారు.