Reading Time: < 1 minute

మీల్ మేకర్స్ ఇష్టంగా తింటారా..! కరీంనగర్ ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తున్నారో చూస్తే..

Caption of Image.

సోయా చంక్స్.. అదే మీల్ మేకర్స్ అంటే తినని వాళ్లు ఎవరుంటారు. కూరగాయలు లేనప్పుడు సింపుల్ గా చేసేందుకు రెడీమేడ్ హై ప్రోటీన్ ఫుడ్ కదా అది. మాంసాహారం తినని వాళ్లు.. అదే స్థాయిలో ప్రోటీన్ అందాలంటే ఈ సోయా చంక్స్ ను మెనూలో యాడ్ చేసుకుంటారు. గ్రేవీ కరీ కోసం అయినా.. ఫ్రై కోసమైనా.. రకరకాల వెరైటీలకు వాడే సోయా చంక్స్ కు ఉన్న డిమాండ్ క్యాష్ చేసుకోవాలని అక్రమ పద్ధతిలో తయారు చేస్తున్నారు కొందరు. అదికూడా మన కరీంనగర్ లో ఉండే కంపెనీలో కల్తీ చేయడం ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే తెలంగాణలో చాలా ప్రాంతాలకు అవి సరఫరా అవుతుంటాయి కదా. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కరీంనగర్ రామడుగులో సోయాచంక్స్ ఫ్యాక్టరీపై టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం (జులై 01) దాడులు చేశారు. దేశరాజుపల్లిలోని మెగా ఇండస్ట్రీస్ ఆకస్మిక తనిఖీలు చేశారు. VS బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేసే ఈ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా.. పబ్లిక్ హెల్త్ ను రిస్క్ లో పెడుతూ తయారు చేస్తుండటం చూసి అధికారులు షాకయ్యారు. 

►ALSO READ | ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటే వ్యక్తిత్వ హననం కాదు.. మత విశ్వాసాలను దెబ్బతీస్తే శిక్షిస్తాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

 సోయా చంక్స్ తయారీలో జంతువుల దాణా రఫ్ బ్రాన్ కలుపుతున్నట్లు గుర్తించారు. 755 అంటే ఏడున్నర క్వింటాళ్ల సోయా చంక్స్ తో పాటు 16 వందల  కిలోల రఫ్ బ్రాన్ ను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఉత్పత్తుల నమూనాలు ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించారు. 

 ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారుల వెల్లడించారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. 

©️ VIL Media Pvt Ltd.