
Shreyas Iyer: భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ గురించే పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ టూర్ లో వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడని ఫ్యాన్స్ ఎంతో ఆశగా వేచి చూశారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం అతడిని తుది జట్టులోకి తీసుకోకుండా బెంచ్‌కే ఫిక్స్ చేసింది. ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపై మ్యాచ్ అయితే ఈ కుర్రాడిపై ఒత్తిడి తక్కువగా ఉంటుందని అందరూ అనుకున్నారు.. కానీ ఆ సిరీస్‌లో భారత్ 0– 2తో ఓడిపోవడంతో వైభవ్‌కు ఛాన్స్ ఇయ్యకపోవడంతో వివాదానికి దారి తీసింది. దీనిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, వైభవ్ తన అరంగేట్రం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిందేనని చెప్పడం తీవ్ర దుమారం రేపింది.
బీహార్ కుర్రోడిని తొక్కేస్తున్నారు: కేంద్రమంత్రి
వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోకపోవడంపై బీహార్‌లోని బేగుసరాయ్ ఎంపీ, కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బీహార్‌లోని సమస్తీపూర్‌కు చెందిన ప్లేయర్‌ను పక్కన పెట్టడంపై కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లపై ఆయన మండిపడ్డారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్, బ్రియాన్ లారా లాంటి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలే వైభవ్ టాలెంట్‌ను మెచ్చుకున్నారని గుర్తు చేశారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు ఉన్న వైభవ్ వరల్డ్ క్రికెట్ భవిష్యత్తు, అలాంటి బీహార్ కుర్రోడిని తొక్కేస్తున్నారంటూ బీజేపీ కేంద్ర మంత్రి కామెంట్స్ చేశాడు.
రాజకీయ ఒత్తిళ్లకు లొంగేది లేదు: శ్రేయస్
ఇంగ్లాండ్‌తో ఈరోజు (జూలై 1) నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ ఫస్ట్ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఈ రాజకీయ ఒత్తిడిపై పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలంటూ పొలిటికల్ నాయకుల నుంచి వస్తున్న డిమాండ్లపై మీడియా ప్రశ్నించగా శ్రేయస్ చాలా కూల్‌గా, అంతే స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చాడు.. న్యూస్ ఛానళ్లలో, సోషల్ మీడియాలో ఎవరు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారనే విషయాలను నేను అస్సలు ఫాలో కాను అని తేల్చి చెప్పాడు. బయట నుంచి వచ్చే ఇలాంటి ఒత్తిళ్లను తాము పట్టించుకోం, తమ ఫోకస్ అంతా ఇంగ్లాండ్ సిరీస్ గెలవడంపైనే ఉందని వెల్లడించాడు.
వైభవ్ కి ఛాన్స్ ఇవ్వండి:
ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన 16 మ్యాచుల్లో ఏకంగా 776 రన్స్ కొట్టాడు. అందులో ఒక సంచలన సెంచరీ, 5 అర్థ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ కుర్రాడు.. ఈ ప్రదర్శన ఆధారంగానే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతంలో ఇండియా అండర్-19 జట్టు తరఫున ఇంగ్లాండ్ పర్యటనలో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించిన రికార్డు కూడా ఉంది. ప్రస్తుత సీనియర్ జట్టులో సంజు శాంసన్ వరుసగా ఫెయిల్ కావడంతో.. అతని స్థానంలో ఈ బీహార్ కుర్రాడికి ఇంగ్లాండ్‌తో జరిగే ఫస్ట్ టీ20లోనే ఛాన్స్ ఇవ్వాలని, అప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో అతను సరికొత్త చరిత్ర సృష్టిస్తాడని మాజీ క్రికెటర్లు అంటున్నారు.
Shreyas Iyer ने Vaibhav Suryavanshi के बारे में क्या कहा? सुनिए।
Vaibhav Suryavanshi वर्ल्ड कप थोड़े जीतवाया है वर्ल्ड कप जीतने वाले खेल रहे हैं और खेलते रहेंगे अभी कोई मौका नहीं मिलेगा ,,
अब यह भारतीय टीम का कप्तान बन गया है। इसकी बात सुनने के बाद क्या आपको लगता है कि Vaibhav… pic.twitter.com/MjvFacRwv9
— Ranjan Singh (@RanjanSinghh_) June 30, 2026