Reading Time: < 1 minute

బాచుపల్లిలో దారుణం.. తాగొద్దు అన్నందుకు భార్యను చంపేసిన భర్త.. సూసైడ్ డ్రామా !

Caption of Image.

తాగుడు మానేయమని చెప్పినందుకు భార్యను భర్త హత్య చేసిన ఘటన హైదరాబాద్ బాచుపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యను చంపేసి.. ఆత్మహత్య చేసుకుందని పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత పది రోజుల  క్రితం తన భార్య భార్గవిని హత్య చేశాడు భర్త కిలారు బాలకృష్ణ. చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో భార్గవిని హత్య చేసి ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులను నమ్మించాడు. మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో దర్యాప్తుకు వచ్చిన పోలీసులను కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. 

►ALSO READ | మీరు మనుషులేనా : మహిళను నగ్నంగా.. చెప్పుల దండతో ఊరేగించారు..!

నిత్యం మద్యం సేవిస్తూ భార్గవిని వేధిస్తుండటంతో మద్యాన్ని మానివేయాలని భార్గవి కోరింది. నన్ను మందు మానెయ్యమనటానికి నువ్వెవరు.. అంటూ భార్యపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశాడు.  మృతురాలు సోదరుడి ఫిర్యాదుతో తమదైన శైలిలో పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో నేరాన్ని అంగీకరించాడు బాలకృష్ణ. 

బాలకృష్ణను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు బాచుపల్లి పోలీసులు. ఆత్మహత్య కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.