Reading Time: < 1 minute

పాతబస్తీ చారిత్రక కమాన్‌లకు కొత్త జీవం..8 కమాన్‌ల పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం

Caption of Image.

హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాతబస్తీలో ఉన్న 8చారిత్రక కమాన్‌ల పునరుద్ధరణకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ పనులను కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (QQSUDA) ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. మొత్తం రూ.11.86 కోట్లతో ఈ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. 

పనులకు అవసరమైన నిధులను హెచ్‌ఎండీఏ నుంచి విడుదలకు అనుమతి ఇచ్చారు. టెండర్ల ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పునరుద్ధరణ చేపట్టనున్న కమాన్‌లలో రాణిగంజ్ కమాన్, షేక్ ఫైజ్ కమాన్, చత్తా బజార్ కమాన్, దివాన్ దియోడి-1 కమాన్, దివాన్ దియోడి-2 కమాన్, డబీర్‌పురా కమాన్, హుస్సేనీఆలం కమాన్, హస్మత్ గంజ్ కమాన్ ఉన్నాయి. వీటిలో హస్మత్ గంజ్ కమాన్ పునరుద్ధరణ కోసం అత్యధికంగా రూ.2.94 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

ALSO READ : సిద్ధాపూర్ ఎకో టౌన్ ప్రాజెక్టుకు.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఈ చారిత్రక నిర్మాణాలను పునరుద్ధరించడం ద్వారా నగర వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడంతో పాటు పర్యాటకులను మరింతగా ఆకర్షించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.