Reading Time: 2 minutes

భారత్ vs ఇంగ్లాండ్ తొలి టీ20కి వర్షం ముప్పు.. ఇంతకీ మ్యాచ్ జరుగుతుందా?

Caption of Image.

IND vs ENG 1st T20I: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోరమైన ఓటమిని మర్చిపోయి, భారత జట్టు మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది. హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. రివర్‌సైడ్ గ్రౌండ్ వేదికగా జరగనున్న ఈ మొదటి టీ20 మ్యాచ్, ఇండియా కొత్త టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు అత్యంత కీలకంగా మారింది. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తొలి విజయం కోసం చూస్తున్న అయ్యర్‌తో పాటు జట్టు సెలెక్షన్ పై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడానికి ఈ మ్యాచ్ ఒక మంచి అవకాశం.

మళ్లీ వర్షం ముప్పు: 

ఐర్లాండ్ సిరీస్‌లో లాగే ఈ మ్యాచ్‌కు కూడా వాతావరణం పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. మ్యాచ్ జరగనున్న చెస్టర్-లీ-స్ట్రీట్‌లో రోజంతా మేఘావృతమై ఉంది, వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 21°C గా నమోదు కావచ్చు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 3:00 గంటల వరకు వర్షం పడే అవకాశం 35 శాతంగా ఉంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10:00 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 2:00 గంటల వరకు కొనసాగుతుంది. దీంతో మ్యాచ్ చూడాలని అనుకునే భారతీయ క్రికెట్ అభిమానులు బిగ్ షాక్ అని చెప్పాలి. 

ALSO READ : ఐసీసీ ర్యాంకింగ్స్‌లో SRH ప్లేయర్ల హవా.. టీ20ల్లో ఇషాన్, టెస్టుల్లో హెడ్ నంబర్-1

ఇంగ్లాండ్ జట్టులో కీలక మార్పులు: 

హోమ్ టీమ్ ఇంగ్లాండ్‌కు హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కానీ, ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మొదటి మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు కాస్త నిరాశ కలిగించే అంశం. అతని స్థానంలో ఇంగ్లాండ్ పేస్ విభాగాన్ని బలోపేతం చేయడానికి ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్‌లు తుది జట్టులోకి వచ్చారు.

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ తొలి టీ20 స్క్వాడ్స్:

భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్
టీమిండియా డకౌట్: వాషింగ్టన్ సుందర్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్

ఇంగ్లాండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, జోర్డాన్ కాక్స్
ఇంగ్లాండ్ డకౌట్: ల్యూక్ వుడ్, జేమ్స్ కోల్స్, రెహాన్ అహ్మద్, సోనీ బేకర్.

 

©️ VIL Media Pvt Ltd.