
దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ (పీఓ/ ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి, 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూలై 01 నుంచి జులై 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ.
మొత్తం ఖాళీలు: 6715.
బ్యాంకుల వారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ బరోడా 1900, బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1100, కెనరా బ్యాంక్ 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 550, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 504, పంజాబ్ & సింధ్ బ్యాంక్ 161.
ఎలిజిబిలిటీ: 2026, జులై 21 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఐబీపీఎస్ పీఓ/ ఎంటీ-XVI –2026 ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది. ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష, ఆ తర్వాత ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష, ఆపై పర్సనాలిటీ టెస్ట్, చివరగా కామన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.ibps.inను సందర్శించండి.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే రాతపరీక్ష పూర్తిగా మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు 40 మార్కులకు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
పర్సనాలిటీ టెస్ట్
మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశ అయిన సెల్ఫ్-రిపోర్ట్ పర్సనాలిటీ టెస్టుకు ఆహ్వానిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఐబీపీఎస్ నిర్ణయం మేరకు ఈ పర్సనాలిటీ టెస్టును ప్రొక్టోర్డ్ విధానంలో (ఆన్‌లైన్ నిఘాలో) లేదా కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు.
కామన్ ఇంటర్వ్యూ
ఎంపిక ప్రక్రియలో కీలకమైన కామన్ ఇంటర్వ్యూను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు అర్హత సాధించాలంటే కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 35 శాతంగా నిర్ణయించారు.
ఫైనల్ సెలెక్షన్
ఉద్యోగాలకు అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్‌ను మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా చేస్తారు. ఇందుకోసం మెయిన్స్ పరీక్ష మార్కులకు 80 శాతం, ఇంటర్వ్యూ మార్కులకు 20 శాతం చొప్పున 80:20 నిష్పత్తిలో వెయిటేజీ ఇస్తూ తుది ఉమ్మడి స్కోరును లెక్కిస్తారు.
ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ & డిస్క్రిప్టివ్)
విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్ 40 60 45 నిమిషాలు
జనరల్/ ఎకనామీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ 50 60 35 నిమిషాలు
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 20 35 నిమిషాలు
డేటా అనాలసిస్ & ఇంటర్ ప్రిటేషన్ 40 60 45 నిమిషాలు
డిస్క్రిప్టివ్ పేపర్ (ఎస్సే & కాంప్రహెన్షన్) 2 25 30 నిమిషాలు
ఐబీపీఎస్ ఆబ్జెక్టివ్ పరీక్షల్లో నెగెటివ్ మార్కుల నిబంధనను అమలు చేస్తోంది.
అభ్యర్థులు గుర్తించే ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 01.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ.175. ఇతరులకు రూ.850.
లాస్ట్ డేట్: జులై 21.
ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ (పీఈటీ): ఆగస్టు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: ఆగస్టు.
ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్: సెప్టెంబర్.
మెయిన్ ఎగ్జామినేషన్: అక్టోబర్.
పర్సనాలిటీ టెస్ట్: నవంబర్.
ఇంటర్వ్యూ: నవంబర్/ డిసెంబర్.
తాత్కాలిక కేటాయింపు: 2027, జనవరి.