
అప్పటివరకు కేరింతలు కొడుతూ ఆడుకున్న పిల్లాడు క్షణాల్లో మాయమైపోయాడు. తోటి పిల్లలు కూడా గమనించలేదు. సిసీకెమెరాల్లో రికార్డు అయింది కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. లేకుంటే ఆ పిల్లాడు ఎక్కడికి పోయాడో ఎవరికి తెలిసేది కాదు..వర్షంలో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి పక్కనే ఉన్న మురుగు కాల్వ నీటిలో మునిగి కొట్టుకుపోయిన హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ సీసీటీవీ వీడియోలో ఇంటిముందు ముగ్గురు చిన్నారులు వర్షపు నీటిలో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురు చిన్నారుల్లో ఒకరు ఆకస్మాత్తుగా ఇంటి పక్కనే ఉన్న మురుగు కాల్వలో పడిపోయాడు. పక్కనే ఉన్న మిగతా పిల్లలు కూడా గమనించలేనంతా క్షణాల్లో నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి.
ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వర్షాకాలంలో పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు జాగ్రత్తలు చెబుతున్నారు.
వర్షాకాలంలో పెద్దవాళ్లకే ఏ ప్లేస్ లో ఏది ఉందో తెలియదు..ఇక వాళ్లు చిన్న పిల్లలు.. వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలదే.. మీ పిల్లలను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టకండి.. అమాయకపు పిల్లలు సులభంగా చేజారిపోగలరు అంటూ నెటిజన్లుజాగ్రత్తలు చెబుతున్నారు.
వర్షాకాలంలో చిన్న పిల్లలను మురుగు కాల్వల దగ్గరకు వెళ్లనీయొద్దు.. కొద్ది పాటి అజాగ్రత్తవల్ల చిన్నారి కాలువ లో కొట్టుకుపోయాడు. అది సీసీ టీవీల్లోరికార్డయింది కాబట్టి తెలిసింది.. లేకుంటే ఆ చిన్నారి ఎక్కడ పోయాడు ఎవరికి తెలిసి ఉండేది కాదు అని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షంలో పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
सीसीटीवी में कैद हो गया वरना पता भी ना चलता बच्चा कहां गया
बारिश में बच्चों का विशेष ध्यान रखें,pic.twitter.com/G5HzXMlvVu— पीडीए भारत (@PDABharat) July 1, 2026