Reading Time: < 1 minute
ధురందర్‌కి పోటీగా సినిమా తీసిన పాకిస్తాన్.. దాని పరిస్థితి ఎంత దారుణం అంటే

బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’. ఈ సినిమాలో కరాచీలోని ‘లైరీ’ ప్రాంతాన్ని, అక్కడి గ్యాంగ్ వార్స్, తీవ్రవాదం, క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో కాస్త డార్క్‌గా చూపించారు. దీనికి కౌంటర్‌గా.. లైరీ ప్రాంతం అంటే కేవలం క్రైమ్ మాత్రమే కాదు, అక్కడ శాంతి, క్రీడలు, ప్రతిభ కూడా ఉన్నాయని ప్రపంచానికి చూపించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అండ్ అక్కడి సింధ్ ప్రావిన్స్ సమాచార శాఖ మంత్రి ‘షర్జీల్ ఇనామ్ మేమన్’… ఓ సినిమాను ప్లాన్ చేశారు. ఆ సినిమా పేరే ‘మేరా లైరీ’. ఈ సినిమా ఇండియన్ ‘ధురంధర్’కు ఒక గట్టి సమాధానం గా పాకిస్తానీ పొలిటికల్ లీడర్స్, మీడియా బాగా ప్రమోట్ చేశారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన మేరా లైరీ మూవీ అట్టర్ ప్లాప్‌ అయింది. ‘ధురంధర్’ మూవీ వరల్డ్ వైడ్‌గా 1,300 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిస్తే.. దానికి పోటీగా భావించిన ‘మేరా లైరీ’ డిజాస్టర్ గా నిలిచింది. ఒక పాక్ థియేటర్ లో తొలి రోజు కేవలం 22 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రేక్షకులు రాకపోవడంతో, థియేటర్ల యజమానులు ఒక్క రోజులోనే లేదా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా ప్రదర్శనలను పూర్తిగా నిలిపివేసి, వేరే సినిమాలను రీప్లేస్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్.. సీసీటీవీ చూసి షాకైన అధికారులు!

స్టూడెంట్‌ చెంపపై కొట్టిన టీచర్‌.. పాపం.. ఆ విద్యార్థి చెవికి

Lawrence: రాజకీయాల్లో లారెన్స్ యూటర్న్?

Suriya: రాజకీయాల్లోకి సూర్య? క్లారిటీ ఇదే..

Maa Inti Bangaram: గుడ్ న్యూస్.. OTTలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ