
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ప్యాన్-ఇండియా రేంజ్ లో మైథలాజికల్ మూవీ ( #NTR32) వస్తోంది. ‘అరవింద సమేత’ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ మూవీ అనౌన్స్‌మెంట్ రాగానే ఇండస్ట్రీలో ఒక రేంజ్ హైప్ క్రియేట్ అయింది. కానీ లేటెస్ట్ గా ఈ సినిమా అఫీషియల్ పోస్టర్ , దానికి మేకర్స్ ఇచ్చిన ట్యాగ్‌లైన్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఒక పెద్ద కల్చరల్ వార్ కు దారితీసింది.
వివాదానికి కారణమైన నాగవంశీ ట్వీట్!
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే, ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను షేర్ చేస్తూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో పెట్టిన క్యాప్షన్ ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. ఆయన తన పోస్ట్ లో “ఉత్తరాదిన జన్మించి.. మధ్యభారతంలో రూపుదిద్దుకుని.. దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు”అంటూ రాసుకొచ్చారు. పోస్టర్‌లో లార్డ్ మురుగన్ ఆయుధమైన ‘ఈటె’ స్పష్టంగా కనిపించడంతో, ఫ్యాన్స్ ఇది సుబ్రహ్మణ్య స్వామి కథే అని ఫిక్స్ అయ్యారు. కానీ “నార్త్‌లో పుట్టాడు” అనే పదం తమిళ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
Born in the North.
Forged in the Heartland.
Worshipped in the South.Now… A tale destined to belong to the universe 💥💥#NTRxTrivikram@tarak9999 #Trivikram @anirudhofficial #SRadhaKrishna @NANDAMURIKALYAN @haarikahassine @NTRArtsOfficial @NTRxTrivikram pic.twitter.com/df7t6kD2oJ
— Naga Vamsi (@vamsi84) June 29, 2026
మా దేవుడు.. హిస్టరీ మార్చకండి..
తమిళనాడులో లార్డ్ మురుగన్‌ను ‘తమిళ్ కడవుల్’ (తమిళుల దేవుడు) అని ఎంతో భక్తితో, తమ సంస్కృతిలో ఒక భాగంగా కొలుస్తారు. సంఘం సాహిత్యం, మురుగన్ ఆరు క్షేత్రాలు అన్నీ తమిళనాడులోనే ఉన్నాయని, అలాంటి దేవుడిని ‘ఉత్తరాది’కి చెందిన వారీగా ఆపాదించడం చరిత్రను వక్రీకరించడమే అని తమిళ నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్ కోసం మా సంస్కృతిని, చరిత్రను మార్చకండి.. మురుగన్‌ను నార్త్ ఇండియన్‌గా చూపిస్తే సినిమాను బాయ్‌కాట్ చేస్తాం అంటూ ఎక్స్ లో గట్టిగా వార్నింగ్‌లు ఇస్తున్నారు.
పురాణాల ప్రకారం కరెక్టే ..
అయితే, ఈ వివాదంపై టాలీవుడ్ ఫ్యాన్స్, పురాణాల తెలిసిన వారు మేకర్స్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఉత్తరాదిన కార్తికేయుడు, స్కాందుడిగా పూజలందుకునే స్వామి.. హిమాలయాల్లోని శరవణ పొయ్‌గైలో జన్మించాడని పురాణాల్లో ఉంది. ఆ నమ్మకం ప్రకారమే మేకర్స్ “Born in the North” అని పెట్టారని డిఫెండ్ చేస్తున్నారు. ఒకే దేవుడిని దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కొలుస్తున్నప్పుడు, దీనిని ప్రాంతీయ వివాదంగా మార్చడం సరికాదని వారు వాదిస్తున్నారు.
ALSO READ : Rao Bahadur: ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రండి..
ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ చుట్టూ ఇంత వివాదం నడుస్తున్నా.. దర్శకుడు త్రివిక్రమ్ గానీ, ఎన్టీఆర్ గానీ ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. మరి ఈ ‘నార్త్-సౌత్’ వివాదానికి త్రివిక్రమ్ తన పెన్ పవర్‌తో ఎలాంటి ముగింపు ఇస్తాడో చూడాలి..