Reading Time: < 1 minute
Six Heroes Trying Their Luck In The July Box Office Race

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది జూలై నెల అత్యంత కీలకమైన నెలగా మారబోతోంది. పెద్ద స్టార్స్ హడావుడి కంటే, ప్రస్తుతం పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి కచ్చితమైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలే ఈ నెలలో ఎక్కువగా బరిలోకి దిగుతుండటం విశేషం. కెరీర్ ను మలుపు తిప్పే ఒకే ఒక్క సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఒకే ఒక్క హిట్ కొట్టి తమ ఫామ్ ని తిరిగి తెచుకునేందుకు వస్తుంటే కొందరు డెబ్యూ మూవీతో సాలిడ్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నారు.

వివరాలలోకెళితే అక్కినేని అఖిల్, సత్యదేవ్, విరాట్ కర్ణ, కిరణ్ అబ్బవరం, సందీప్ కిషన్, తిరువీర్, జయకృష్ణ మరియు విశాల్ వంటి హీరోలందరి సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఈ హీరోలందరికీ స్టార్‌డమ్ కంటే ఇప్పుడు సక్సెస్ సాధించడమే అత్యంత అవసరమైన పరిస్థితి నెలకొంది. అందుకే ఈ జూలై బాక్స్ ఆఫీస్ రేసు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ముందుగా అఖిల్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘లెనిన్’ జూలై 10న  వస్తుంది. ఈ సినిమా అఖిల్ కు చాలా కీలకం. ఇక తిరువీర్ ‘ఓ సుకుమారి’ జూలై 17న కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ జూలై 24న, మరియు సందీప్ కిషన్ ‘సిగ్మా’ జూలై 31న థియేటర్లలో సందడి చేయనున్నారు. మరి ఈ ఆసక్తికరమైన రేసులో ఎవరి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి వారి కెరీర్‌ను మలుపు తిప్పుతుందో చూడాలి.