పులిహోర గోంగూర రెసిపికి కావాల్సిన పదార్థాలు : మూడు కట్టలు గోంగూర ఆకులు, కొద్దిగా చింతపండు, 10 ఎండు మిర్చి,
4 పచ్చిమిర్చి , 10 వెల్లుల్లి రెబ్బలు , పావు టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,
ఒక టేబుల్ స్పూన్ ఆవాలును తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే అదిరిపోతోంది.
పులిహోర గోంగూర రెసిపికి కావాల్సిన పదార్థాలు: ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు , ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, నాలుగు కరివేపాకు రెబ్బలు, చిటికెడు ఇంగువ , అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఐదు టేబుల్ స్పూన్ నువ్వుల నూనెను తీసుకోవాలి, ఇలా పచ్చడికి సరిపడా తీసుకోవాలి.
పులిహోర గోంగూర రెసిపి తయారీ విధానం: ముందుగా ఈ గోంగూర ఆకులను బాగా కడిగి వీటిని బాగా ఆరనివ్వాలి. ఆ తరవాత పెనంపై ఆయిల్ లేకుండా ఈ గోంగూరను బాగా వేయించి దీనిలోని నీరు మొత్తం పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ తరవాత దీనిని బాగా చల్లారనివ్వాలి. ఇలా చేస్తే అది మంచిగా అవుతుంది.
ఇప్పుడు చిన్న పెనం తీసుకుని దానిలో కొంచం నూనె వేసి రెండు ఎండు మిర్చి, కొద్దిగా ధనియాలు, ఇంకా జీలకర్ర, నాలుగు మెంతులు వేయించి పొడిలాగా చేసుకోవాలి. ఇంకా అదే పెనంలో మళ్ళీ నూనె వేసి రెండు వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి. ఇక ఇప్పుడు గోంగూర, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసి రోట్లో వేసి దంచి రుబ్బుకోవాలి.
చివర్లో పోపు పెట్టడం కోసం నూనె వేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించుకోవాలి.
ఈ పోపును పచ్చడి మీద పోసి బాగా కలుపుకోవాలి. దీనిని పులిహోరలా చేయాలంటే అన్నంలో ఒక టేబుల్ స్పూన్ల గోంగూర పచ్చడి వేసి అది చూడటానికి అలాగే అవుతుంది. ఇంకా జొన్న రొట్టెల్లోకి సూపర్ ఉంటుంది.




