Reading Time: 2 minutes
Ap Eapcet 2026 Results Declared Engineering Agriculture Pharmacy Rank Cards

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. సోషల్ మీడియా ఎక్స్ ద్వారా మంత్రి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 1,82,317 మంది విద్యార్థులు అర్హత సాధించగా.. మొత్తం 70.52 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో మాత్రం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ విభాగాల్లో 63,546 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. మొత్తం 89.59 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఇక ఇంజినీరింగ్ విభాగంలో విద్యార్థినులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ విభాగంలో 71.65 శాతం విద్యార్థినులు అర్హత సాధించడం విశేషంగా నిలిచింది. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ సేవ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు సందేశం పంపి ఫలితాలను పొందవచ్చు. ఫలితాల విడుదలతో ఉన్నత విద్యలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీంతో వేలాది మంది విద్యార్థులు తమ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారు.