
అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఓ పోలీస్ ఉన్నతాధికారి భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నాడని ఆయన ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే..
డీఎస్పీ భీమ్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ హైదరాబాద్ తోపాటు 15చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు…
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పని చేసిన భీం రెడ్డి భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నాడని ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ ఆఫీస్‌లోని కంప్యూటర్ సర్వీసెస్‌లో పని చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..