Reading Time: < 1 minute
Ed Auctions Hawker 800a Aircraft Rs 3 Crore Pmla Case Hyderabad

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దేశంలో తొలిసారిగా ఓ విమానాన్ని వేలం వేసి విక్రయించింది. హాకర్ 800ఏ (Hawker 800A) విమానాన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ లిమిటెడ్ ద్వారా జూలై 1న ఈ-వేలం నిర్వహించి రూ.3 కోట్లకు విక్రయించినట్లు ఈడీ వెల్లడించింది. ఈ విమానాన్ని 2025 మార్చి 7న హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి చెందిన ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానాన్ని జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసు అమర్‌దీప్ కుమార్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మరికొందరిపై నమోదైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కేసుకు సంబంధించినదని ఈడీ వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో భాగమైన ఈ విమానాన్ని చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక ఈ-వేలం ద్వారా విక్రయించినట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసులో జప్తు చేసిన విమానాన్ని ఈడీ ఈ విధంగా వేలం వేయడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం.