హిందూ సంప్రదాయంలో దీపారాధనకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. సాధారణంగా ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగించడం ఎంత పుణ్యమో, సాయంత్రం వేళ సంధ్యా సమయంలో దీపం పెట్టడం కూడా అంతే పవిత్రమని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో సిరిసంపదలు కలగడం కోసం సాయంత్రం పూట దీపం వెలిగించడం ఎంతో ముఖ్యం. అసలు సాయంత్రం వేళ దీపారాధన ఎందుకు చేయాలి? దానివల్ల కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం.
సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయం ప్రత్యేకం: సూర్యాస్తమయం అయ్యే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య సమయాన్ని ‘ప్రదోష కాలం’ లేదా ‘సంధ్యా సమయం’ అంటారు. ఇక ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తులు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు.ఇక ఈ టైంలో ఇంట్లో లేదా పూజా గదిలో దీపం వెలిగించడం వల్ల ఇంటి నిండా సానుకూల శక్తి నిండుతుంది. లక్ష్మీ కటాక్షంతో పాటు కుటుంబంలో శాంతి, సౌఖ్యం లభిస్తాయని పెద్దలు చెబుతారు.
తులసి కోట దగ్గర నెయ్యి దీపం: మన సంప్రదాయంలో తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా, విష్ణుమూర్తి నివాసంగా భావిస్తారు. అందుకే ప్రతిరోజూ సాయంత్రం వేళ తులసి కోట దగ్గర శుభ్రం చేసి, లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇక ఇలా నిత్యం చేయడం వల్ల ఆ ఇంట్లో ధనధాన్యాలకు ఎన్నటికీ కొరత ఉండదని, లక్ష్మమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందని నమ్మకం.
కర్పూర హారతితో నెగటివ్ ఎనర్జీకి చెక్: సాయంత్రం దీపారాధనతో పాటు ఇంట్లో కర్పూరం వెలిగించడం చాలా మంచిది. కర్పూరం వెలిగించి ఇల్లంతా చూపించడం వల్ల రోజంతా ఇంట్లో చేరిన నెగటివ్ ఎనర్జీ, దిష్టి వంటివి తొలగిపోతాయి. ఇక వెలిగించిన కర్పూరాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది. దీనివల్ల ఇంట్లో ఆనందం, ప్రశాంతత పెరుగుతాయి.
వారంలో ప్రతిరోజూ దీపం వెలిగించాలి: కొందరు కేవలం శుక్రవారం, మంగళవారం మాత్రమే సాయంత్రం దీపాలు పెడుతుంటారు. కానీ శాస్త్రాల ప్రకారం వారంలోని ప్రతి రోజు సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఆయా రోజులకు సంబంధించిన గ్రహ దోషాలు తొలగిపోయి, అద్భుతమైన ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయి. రోజువారీ జీవితంలో ఒత్తిడి తగ్గి, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి.
ఇక సాయంత్రం వేళ దీపం వెలిగించడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మన ఇంటికి ఒక రక్షణ కవచం లాంటిది. సంధ్యా సమయంలో ఇల్లు చీకటిగా ఉంచకుండా కనీసం ఒక చిన్న దీపం వెలిగించి, దేవుడికి నమస్కరించుకుంటే ఆ ఇల్లు ఎప్పుడూ సుఖసంతోషాలతో కలకలలాడుతుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం ఆధ్యాత్మిక విశ్వాసాలు, శాస్త్రాల ఆధారంగా అందించబడింది. భక్తిశ్రద్ధలతో సాయంత్రం వేళ దీపం వెలిగించి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి.
The post లక్ష్మిదేవి కటాక్షం కోసం… సాయంత్రం దీపం తప్పనిసరిగా వెలిగించాలా? appeared first on Manalokam – Latest Telugu News & Updates.