
దిన ఫలాలు (జూలై 4, 2026): మేష రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో బాగా ఆకట్టుకుంటారు. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. మిథున రాశి వారికి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ రోజు (శనివారం) రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక విష యాల మీద శ్రద్ధాసక్తులు బాగా పెరుగుతాయి. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. అను కోకుండా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద శ్రద్ధ పెడతారు. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగు తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికారులను పనితీరుతో బాగా ఆకట్టుకుంటారు. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థికా భివృద్ధి మార్గాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసు కుంటారు. పిల్లలు బాగా పురోగతి సాధిస్తారు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. ఒకరి ద్దరు మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోవడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొందరు బంధువుల్ని ఆర్థికంగా ఆదుకుంటారు. వృత్తి జీవితంలో కొత్త ఆలో చనలు అమలు చేస్తారు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్ని చక్కబెడ తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి కొద్దిగా తగ్గే అవకాశముంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒకటి రెండు శుభవార్తలువింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యాలకు, ఉచిత సహాయాలకు ఇది సమయం కాదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శించుకుంటారు. బంధువుల రాకపోకలుంటాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
శుభ గ్రహాల అనుకూలత వల్ల రోజంతా అనుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది.ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగ స్వామి కూడా వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సొంత ఆలోచనల వల్ల లాభముంటుంది. కొందరు మిత్రుల వల్ల ఇబ్బందులుంటాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమ స్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్త అందుకుంటారు. ఇష్టమైన మిత్రులతో విందులో పాల్గొంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో కొత్త పద్ధతులు అనుసరిస్తారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. రాజీమార్గంలో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించడంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సరైన స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యో గాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యకలాపాలన్నీ సజావుగా సాగిపో తాయి. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ పెట్టడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతల మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత ఒకటి సమస్య పరిష్కారమవుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. చేపట్టిన పనుల్లో తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు పెడతారు. ప్రముఖులతో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశాంత, ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.
Also Read: ఈ రాశులకు శుక్ర దశ.. ఇక వారికి పట్టిందల్లా బంగారమే..!