Reading Time: 2 minutes

జ్యోతిష్యం: జులై నెల 2026 కన్యారాశి వారి ఫలితాలు ఇవే.. ఈ పరిహారాలు చేస్తే తిరుగుండదు..!

Caption of Image.

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల ( జులై 2026)లో కెరీర్​ పరంగా స్థిరత్వం కలిగే అవకాశం ఉంది. దశమ, లాభ స్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే కన్యారాశి  లాభ స్థానంలో (11వ ఇల్లు)  గురువు, భౌతిక సుఖాలను, డబ్బును పుష్కలంగా ఇస్తాడు. రాశ్యాధిపతి అయిన బుధుడు జూలై 7న స్వక్షేత్రమైన మిథునంలోకి (వృత్తి స్థానం) ప్రవేశించడం వలన కెరీర్​ విషయంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  మీ తెలివితేటలకు ఆఫీసులో అందరూ సలాం చేస్తారు.

ఈ రాశి వారికి  బయట ఎంత గుర్తింపు వచ్చినా, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం 12వ ఇంట్లో ఉన్న కేతువు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. తెలియని ఆత్మన్యూనతా భావం.. జీవితం పట్ల నిర్లిప్తత, మరియు భవిష్యత్తు గురించిన అకారణ భయం మీ నిద్రను పాడుచేస్తాయి. ఈ చిన్న మానసిక సంఘర్షణను పక్కన పెడితే, మీరు ఆర్థికంగా, వృత్తిపరంగా అత్యున్నత శిఖరాలను అందుకునే నెల ఇది.

కన్యారాశి వారికి ఈ నెల ( జులై)లో  కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సామరస్యం బాగా ఉంటుంది.  జీవిత భాగస్వామికి ఇష్టమైన వస్తువును బహుమతిగా ఇచ్చే అవకాశాలున్నాయి.  అనవసరంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కలుగుతాయి.  వృత్తి, ఉద్యోగాల జీవితం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. కుటుంబంలో ఒకటి రెండు సమస్యల వల్ల ఇబ్బందులు పడ తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా నిదానంగా పూర్తవుతుంది. 

వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి ఆర్థికంగా బాగా లబ్ధి పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్ప కుండా ఫలిస్తాయి. మంచి సంస్థల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. బంధుమిత్రులకు అండగా నిలబడ తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

ఈ నెలలో ఉన్న కేతువు వల్ల కలిగే మానసిక ఒత్తిడి, నిద్రలేమి తగ్గించుకోవడానికి మరియు గురు గ్రహ లాభాలను నిరంతరం పొందడానికి ఈ పరిహారాలు పాటించండి

 కేతు శాంతి: రాత్రిళ్లు పీడకలలు, నిద్రలేమి, మరియు ఆత్మన్యూనతా భావం తొలగిపోవడానికి ప్రతిరోజూ గణపతి అథర్వశీర్షం పఠించండి. వీధి కుక్కలకు లేదా జంతువులకు ఆహారం పెట్టండి.

 శని దోష నివారణ: జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగడానికి శనివారం శివాలయంలో  నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి

 గురు అనుగ్రహం: ఆర్థిక లాభాలు అలాగే నిలిచి ఉండటానికి గురువారం నాడు శనగలు దానం చేయండి  దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి..

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.