
తెలంగాణ అప్పులపై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విసిరిన సవాల్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బుధవారం ( జులై 1 ) మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి జూపల్లి. కేటీఆర్ పచ్చి అబద్దాలు చెబుతూ… చిలక పలుకులు పలుకుతున్నాడని అన్నారు. కేటీఆర్ సవాల్ కు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ అవసరం లేదని… తాను చాలని అన్నారు మంత్రి జూపల్లి.
కేసీఆర్ పదేళ్లు గొప్పలు చెప్పుకున్నారని..కొందరు కేసీఆర్ ను జాతిపిత అని పొగిడారని… కేసీఆర్ గొప్ప పని చేస్తే ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు జూపల్లి. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ చేసిన అప్పులపై అసెంబ్లీలో లెక్కలతో సహా చెప్పామని.. పదేళ్లు అప్పులు చేసి మళ్ళీ దబాయిస్తున్నారని అన్నారు జూపల్లి.బీఆర్ఎస్ చేసిన అవినీతిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమేనని.. కేటీఆర్ వస్తారా అని ప్రశ్నించారు.