Reading Time: 2 minutes
Bank Holiday July 2026: వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!

Bank Holiday July 2026: కొత్త నెల ప్రారంభమైంది. ఈ నెలలో మీకు ఏమైనా బ్యాంకు పని ఉంటే ముందుగా సెలవుల జాబితాను తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే, దేశవ్యాప్తంగా వారపు సెలవులు, ముఖ్యమైన సెలవులు, పండుగల కారణంగా జూలై 2026లో బ్యాంకులు 12 రోజుల పాటు మూసి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండదని గమనించడం ముఖ్యం. కొన్ని సెలవులు జాతీయమైనవి, అవి దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. అయితే చాలా వరకు ప్రాంతీయమైనవి. అవి కేవలం ఆయా రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. ఉదాహరణకు రథయాత్ర కారణంగా జూలై 16న ఒడిశాలో బ్యాంకులు మూసి ఉంటాయి. కానీ హర్యానా, పంజాబ్‌లలో ఈ రోజున బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.

ఇది కూడా చదవండి: Petrol Diesel Prices: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..

జూలై నెలలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో సహా మొత్తం ఆరు సాధారణ సెలవులను పాటిస్తాయి. దీనికి అదనంగా మొహర్రం, రథయాత్ర, ఇతర స్థానిక పండుగల కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు ఆరు రోజుల పాటు మూసి ఉంటాయి.

  • జూలై 5: ఆదివారం (వారపు సెలవు దినం)
  • జూలై 6: మొహర్రం (ఆషూరా) సందర్భంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • జూలై 9: బెహ్ దింఖ్లాం సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • జూలై 11: రెండవ శనివారం (అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)
  • జూలై 12: ఆదివారం (వారపు సెలవు దినం)
  • జూలై 16: రథయాత్ర కారణంగా ఒడిశా, మణిపూర్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • జూలై 17: యు. టిరోట్ సింగ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
  • జూలై 18 (శనివారం): డ్రుక్పా సే-సే పండుగ సందర్భంగా సిక్కిం రాష్ట్రంలోని (గాంగ్‌టక్) బ్యాంకులు మూసి ఉంటాయి.
  • జూలై 19: ఆదివారం (వారపు సెలవు దినం)
  • జూలై 22: ఖార్చీ పూజ కారణంగా త్రిపురలో బ్యాంకు శాఖలకు సెలవు.
  • జూలై 25: నాల్గవ శనివారం (అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్‌)
  • జూలై 26: ఆదివారం (వారపు సెలవు దినం)

యథావిధిగా ఆన్‌లైన్ సేవలు:

బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ, యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టిజిఎస్, ఏటీఎం సేవలు యథావిధిగా పనిచేస్తాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ల ద్వారా నగదు బదిలీలు, బిల్లు చెల్లింపులు, ఇతర సేవలను సులభంగా చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవడం లేదా అత్యవసర పనులను సెలవులకు ముందే చేసుకోవాలని ఆర్‌బిఐ సిఫార్సు చేస్తోంది.

ఇది కూడా చదవండి: IRCTC: తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? కన్ఫర్మ్‌ కావాలంటే ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి