Reading Time: 2 minutes
Fluffy Omelette Recipe How To Make Soft Spongy Cafe Style Omelette At Home

Fluffy Omelette Recipe: ప్రతిరోజూ ఒకే విధమైన ఆమ్లెట్ తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఫ్లఫీ ఆమ్లెట్ చేసి చూడండి. బయట కేఫేల్లో లభించే సౌఫ్లే తరహా ఈ ఆమ్లెట్ చాలా మెత్తగా, స్పాంజీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు దీని టెక్స్చర్‌ను బాగా ఇష్టపడతారు. చాలా తక్కువ పదార్థాలతో, సులభమైన విధానంలో ఈ ఫ్లఫీ ఆమ్లెట్‌ను తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేస్తారో చూసేద్దామా..

కావలసిన పదార్థాలు:

* గుడ్లు – 3
* ఉప్పు – తగినంత
* కారం పొడి – ½ టీ స్పూన్ (లేదా రుచికి సరిపడా)
* బటర్ లేదా నూనె – 1 టీ స్పూన్

తయారీ విధానం:

* ముందుగా మూడు గుడ్లను పగలగొట్టి అందులోని ఎగ్ వైట్ (తెల్లసొన), ఎగ్ యోక్ (పచ్చసొన)ను వేరు చేసుకోవాలి. ఇందుకోసం స్టైనర్ లేదా గుడ్డు విడదీయడానికి ఉపయోగించే సాధనాన్ని ఉపయోగించవచ్చు.

* తర్వాత పచ్చసొనను ఒక గిన్నెలో వేసి ఫోర్క్ సహాయంతో బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక తెల్లసొనను మరో గిన్నెలో తీసుకుని విస్కర్ లేదా ఫోర్క్‌తో సుమారు 8 నుంచి 10 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి. తెల్లసొన ఫోమ్‌లా మారి గట్టిగా నిలిచే స్థితికి వచ్చినప్పుడు ఆపాలి. తెల్లసొనను ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ అంత మెత్తగా, ఫ్లఫీగా వస్తుంది.

* ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా బటర్ లేదా నూనె వేసుకోవాలి. ముందుగా బీట్ చేసిన పచ్చసొన మిశ్రమాన్ని పాన్‌లో పోసి సమానంగా పరచాలి. దానిపై కొద్దిగా ఉప్పు, కారం చల్లాలి.

* ఆ తర్వాత బీట్ చేసి సిద్ధం చేసుకున్న తెల్లసొన ఫోమ్‌ను పచ్చసొనపై నెమ్మదిగా వేసి మొత్తం పరచాలి. పైన మరోసారి చిటికెడు ఉప్పు, కొద్దిగా కారం చల్లి మూత పెట్టాలి. తక్కువ మంటపై రెండు నిమిషాల పాటు ఉడికించాలి.

* ఆమ్లెట్ ఒకవైపు ఉడికిన తర్వాత దానిని జాగ్రత్తగా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ ప్లేట్‌పై పాన్‌ను బోర్లించి, ఆమ్లెట్‌ను నెమ్మదిగా తిరగేసి మళ్లీ పాన్‌లోకి వేసుకోవాలి. మరో రెండు నిమిషాల పాటు ఉడికిస్తే ఫ్లఫీ ఆమ్లెట్ సిద్ధమవుతుంది.

* వేడి వేడిగా టమాటో సాస్, మయోనైస్ లేదా మీకు ఇష్టమైన డిప్‌తో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది. పిల్లల టిఫిన్ లేదా బ్రేక్‌ఫాస్ట్‌కు బెస్ట్ ఆప్షన్.