
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ టాక్సిక్’. భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి గీతూ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ విజువల్ వండర్ ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ అన్నీ యష్ చుట్టూనే తిరిగాయి. కానీ లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్న లేడీ గ్యాంగ్ ను పరిచయం చేశారు. లేడీస్ & లేడీస్ పేరుతో సరికొత్త గ్లింప్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రొమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కిడ్స్ స్టే అవే..
దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రారంభంలోనే ఇచ్చిన డిస్క్లైమర్ సినిమా వైబ్‌ని సెట్ చేసింది. పిల్లలు దూరంగా ఉండండి.. తల్లిదండ్రులు మీ పిల్లలను దూరంగా ఉంచండి.. ముత్తాతలు మీ ఓన్ రిస్క్‌తో చూడండి అంటూ చాలా బోల్డ్‌గా, హిలేరియస్‌గా ఇచ్చిన వార్నింగ్, ఈ సినిమా ఎంత వైల్డ్‌గా ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. ఒక పవర్‌ఫుల్ ఫీమేల్ వాయిస్ ఓవర్‌తో సాగే ఈ గ్లింప్స్, సినిమాలో మహిళా పాత్రలు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే శక్తివంతమైన పాత్రలని స్పష్టం చేసింది.
యష్ వర్సెస్ లేడీ గ్యాంగ్..
ఈ గ్లింప్స్‌లో టాలీవుడ్, బాలీవుడ్, శాండల్‌వుడ్‌కి చెందిన టాప్ హీరోయిన్లు ఊరమాస్ అవతారంలో దర్శనమిచ్చారు. షార్ట్ హెయిర్ లుక్‌లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడుపుతూ ఫుల్ కాన్ఫిడెంట్‌గా, కమాండింగ్ లుక్‌లో నయనతార అదరగొట్టింది. తనదైన గ్లామర్, మెస్మరైజింగ్ లుక్స్‌తో స్క్రీన్ ప్రెజెన్స్‌ను కియారా అద్వానీ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఎప్పుడూ సాఫ్ట్ రోల్స్ చేసే కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్.. ఇందులో కత్తులు పట్టి వైల్డ్ అండ్ ఫీర్స్ లుక్‌లో షాక్ ఇచ్చింది. స్టైలిష్, మిస్టీరియస్ అండ్ ఇంటెన్స్ రోల్స్‌తో తారా సుతారియా , హుమా ఖురేషి క్యూరియాసిటీని పెంచేశారు.
వీరందరి యాక్షన్ ఎపిసోడ్స్, యష్‌తో వీరు తలపడే ఇంటెన్స్ కత్తుల యుద్ధాలు, హ్యాండ్-టు-హ్యాండ్ కాంబ్యాట్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. దీనికి తోడు రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం అనిపిస్తోంది.
రిలీజ్ డేట్ ఫిక్స్..
కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో షూట్ చేశారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో డబ్ చేసి, ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 26, 2026న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ ‘టాక్సిక్’ లేడీ గ్యాంగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.