Reading Time: < 1 minute
Telangana Police Bulletproof Vehicles Removed Former Dgps

Telangana Police : తెలంగాణ పోలీస్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన దాదాపు 20 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్న పలువురు అధికారులకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పోలీస్ శాఖ పూర్తిగా తొలగించింది. ఈ జాబితాలో మాజీ డీజీపీలు స్వరజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మలతో పాటు పూర్ణచందర్రావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నవీన్ ఛంద్, డానియల్, వెంకట్రామిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డి టి నాయక్, ఉమేష్ షరీఫ్, రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్ , హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు ఉన్నారు.

వాహనాల తొలగింపుతో పాటు మాజీ డీజీపీలకు ఇప్పటివరకు ఉన్న ఎస్కార్ట్ వాహనాలను సైతం పోలీస్ శాఖ వెనక్కి తీసుకుంది. భద్రతా సమీక్షలో భాగంగా పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీసు అధికారులకు ఉన్న గన్‌మెన్ల సంఖ్యను కూడా భారీగా తగ్గించారు. విధుల్లో మార్పులు చేస్తూ చాలావరకు సెక్యూరిటీని వన్ ప్లస్ వన్ (1+1) గన్‌మెన్లకే పరిమితం చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.