
టెక్నాలజీ విషయంలో చైనా ఎలా ఆలోచిస్తుందో ప్రపంచానికి తెలుసు. ఊహించని ఆవిష్కరణలతో వరల్డ్ వండర్స్ క్రియేట్ చేయడం ఆ కంట్రీ స్పెషల్. టెక్ దిగ్గజ కంట్రీలుగా చెప్పుకునే అమెరికా, యూరప్ దేశాలు కూడా చైనాను చూసి వావ్.. అనేలా వాళ్ల ఇన్వెన్షన్స్ ఉంటాయి. లేటెస్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమ్మర్ కూలింగ్ టెక్నిక్ ప్రపంచాన్ని ఆకర్శిస్తోంది. అదేంటో చూద్దాం.
చైనాలోని కొన్ని ప్రాంతాలను తీవ్రమైన సమ్మర్ హీట్ పట్టిపీడిస్తున్న తరుణంలో, ఒక ఏరియాలోని అపార్ట్మెంట్స్ అనుసరిస్తున్న విధానం వైరల్ గా మారింది. ఉత్తర చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో ఉన్న యున్‌చెంగ్ నగరంలో, ఎత్తైన అపార్ట్‌మెంట్ భవనాల పైకప్పులపై నీటిని సన్నని తుంపరలా.. అంటే షవర్ రెయిన్స్ లాగా చల్లే మిస్టింగ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారు. ఇవి వేడిమిన తగ్గించడంతో పాటు, ప్రజలను మండే ఎండ నుంచి రిలీఫ్ అందిస్తాయి.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంటి పైకప్పుల నుంచి పొగమంచు మేఘాల్లాగా కిందికి తేలుతూ వచ్చి, కింద ఉన్న వీధులను, వాకింగ్ వేస్ ను చల్లబరుస్తున్న విజువల్స్ వీడియోలో చూడవచ్చు.
प्रचंड गर्मी से राहत के लिए सेंट्रल चीन के #Shanxi में मिस्ट कूलिंग सिस्टम का प्रयोग किया जा रहा है।
इससे तामपान 5 से 8 डिग्री कम हो जाता है। pic.twitter.com/jkacrlqmQt— Madhurendra kumar मधुरेन्द्र कुमार (@Madhurendra13) July 1, 2026
►ALSO READ | వెనిజులా భూకంపంలో మిరాకిల్.. చీకట్లోనే 5 రోజులు.. శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డ కుక్కపిల్ల!
పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి దేశాలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో, ఈ దృశ్యాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అలాగే, వాతావరణ మార్పుల నుంచి టౌన్ ప్లానింగ్ ఎలా ఉండాలనేది ఈ వీడియోలను చూస్తే క్లారిటీ వస్తుంది.
పొగమంచు ఎలా కూల్ చేస్తుంది..?
ఈ శీతలీకరణ వ్యవస్థ ఎవాపరేటింగ్ కూలింగ్ అనే సైంటిఫిక్ ప్రిన్సుపుల్ ఆధారంగా పనిచేస్తుంది. ఇంటి పైకప్పులపై అమర్చిన హై ప్రెజర్ నాజిల్‌లు చాలా సన్నని నీటి బిందువులను గాలిలోకి పిచికారీ చేస్తాయి. ఆ వేపర్స్ ఆవిరైపోతున్నప్పుడు, చుట్టుపక్కల గాలి నుంచి వేడిని గ్రహించి, గాలిని చల్లబరుస్తాయి. దీనికి ఉదాహరణ.. సమ్మర్ లో చెమట వచ్చినప్పుడు అది చల్లబడి బాడీని కూల్ గా చేసే విధానం దీనికి సరిగ్గా సరిపోతుంది.
బయటి ఉష్ణోగ్రతలు 38°Cకి దగ్గరగా ఉన్నప్పుడు, ఈ సిస్టమ్ నిమిషాల్లోనే గాలి, ఉపరితల ఉష్ణోగ్రతలను సుమారు 5°C నుండి 8°C వరకు తగ్గిస్తుందని చైనా మీడియా వెల్లడించింది.
నీటి బిందువులు చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల, వేడి, పొడి వాతావరణ పరిస్థితులలో అవి త్వరగా ఆవిరైపోతాయి. దీనివల్ల రోడ్లు గానీ, ఫుట్ పాత్ పై జనాలుగానీ తడవకుండానే కూల్ అయిపోతారు.
ఈ సిస్టమ్ కు నీరు, పంపులు , అధిక పీడన నాజిల్‌లు అవసరం. దీనికి సాంప్రదాయ ఎయిర్ కండిషనింగ్ కంటే చాలా తక్కువ విద్యుత్‌ను అవసరం అవుతుంది. చైనాలోని అనేక సిటీల్లో వేసవి కాలంలో పార్కులు, ఓపెన్ ప్లేస్ లు , ఫుట్ పాత్ లు, బస్ స్టాప్‌ల వద్ద ఇలాంటి ఓపెన్ మాయిస్చర్ ( తేమ) సిస్టమ్స్ ను ఇప్పటికే ఆ కంట్రీలో వాడుతున్నారు.
🚨🇪🇺🇨🇳 Thousands die in Europe’s heatwaves while brainless leaders BAN A/C when it’s 40°C.
This mist cooling system cuts temperatures by 5 to 8°C.
European politicians do EVERYTHING against their own people. pic.twitter.com/D9eEkuVHBA
— Global Dissident (@GlobalDiss) July 1, 2026
చైనా విధానం వెనుక..
ఇటీవలి కాలంలో చైనాలో వాతావరణం సాధారణం మించి వేడెక్కుతోంది. అక్కడ వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి తోడు సిటీల్లో హై రైజ్ బిల్డింగ్స్ కూడా ఒక కారణం. భవనాలు, రోడ్లు, కాంక్రీట్ వేడిని గ్రహించి స్టోర్ చేసుకుంటాయి. దీంతో నార్మల్ టెంపరేచర్ ను మించి అక్కడ ఉష్ణాగ్రతలు నమోదవుతున్నాయి.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నాలకు ఈ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. అయితే ఈ సిస్టమ్ వలన నీటి కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు కూడా పెరిగిపోతున్నాయి. అయితే పొగమంచు దాదాపు వెంటనే ఆవిరైపోతుంది కావునా.. తక్కువ నీటి వినియోగం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూసి ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్స్ ఫుల్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల హీట్ వేవ్ తో యూరప్ కంట్రీస్ లో వేలల్లో జనాలు చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే రోడ్లు కూడా కరిగి రవాణాకు ఉపయోగించలేని స్థితికి వస్తున్నాయి. చైనా అనుసరిస్తున్న ఈ విధానం చూసి.. యూరప్ కూడా ఇది ఫాలో అయ్యుంటే సేఫ్ అయ్యేది కదా అని కామెంట్స్ చేస్తున్నారు.