Reading Time: < 1 minute
Ram Charan Buchi Babu Sana Rc18 Movie Update Advance Paid

RC18: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబుల బ్లాక్‌బస్టర్ జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. వీరిద్దరి కలయికలో ఇటీవల రిలీజ్ అయిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. వీరి తదుపరి నెక్ట్స్ చిత్రం గురించి ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం డైరెక్టర్ బుచ్చిబాబు ప్రతిభకు, ఆయన స్టోరీలకు ఫిదా అయిన రామ్ చరణ్.. ఆయనతో మరో ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ టాలీవుడ్‌కు చెందిన ఒక అగ్ర నిర్మాతకు స్వయంగా కీలక సూచన చేశారట. ఇప్పుడే బుచ్చిబాబుకు ఒక భారీ అడ్వాన్స్ ఇచ్చి, ఆయన డేట్స్‌ను లాక్ చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. హీరో స్వయంగా రంగంలోకి దిగడంతో ఆ టాప్ ప్రొడ్యూసర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దర్శకుడికి భారీ స్థాయిలో అడ్వాన్స్ అమౌంట్‌ను అందజేశారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇదే సమయంలో డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఈ భారీ అడ్వాన్స్‌ను అందుకున్నట్లు తెలుస్తుండటంతో ఈ క్రేజీ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో చరణ్ రాబోయే చిత్రాల లైనప్ మరింత పక్కాగా మారింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ తన 17వ చిత్రాన్ని (#RC17) క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే, రామ్ చరణ్ తన 18వ చిత్రాన్ని (#RC18) మళ్లీ బుచ్చిబాబు దర్శకత్వంలోనే పట్టాలెక్కించబోతున్నారని చెబుతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.