Reading Time: < 1 minute

ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని.. ఖర్గే, ఖుర్షిద్, ఖేరాలకు ఇరాన్ ఆహ్వానం

Caption of Image.

అమెరికా, ఇరాన్ యుద్దంలో చనిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కు ఇరాన్ ఆహ్వానం పంపింది. ఖర్గేతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు  సల్మాన్ ఖుర్షిద్, పవన్ ఖేరాలను కూడా ఇరాన్ ఆహ్వానించింది. అంతకుముందు ఖమేనీ అంత్యక్రియలకు రావాలన ప్రధానిమోదీని కూడా ఇరాన్ ఆహ్వానం పంపింది. 

ఖమేనీ చనిపోయి నాలుగు నెలల తర్వాత  ఆయన అంత్యక్రియలను జూలై 4 న నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరపున హాజరయ్యేందుకు న్యూఢిల్లీ, బీహార్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అత హస్సైన్(రిటైర్డ్) విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటను ఎంపిక చేసింది. 

►ALSO READ | దెబ్బకు దెబ్బ తీసిన ఆప్ఘాన్.. పాకిస్తాన్‎పై మెరుపు దాడులు

అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్, భారత్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సంబంధాలతోనే పాకిస్తాన్ ను దాటుకొని ఆఫ్ఘనిస్తాన్, చాబమార్ పోర్టు, అంతర్జాతీయ ఉత్తరదక్షిణరవాణా కారిడార్ ద్వారా మధ్య ఆసియా, యూరేషియాకు భారత్కు కీలకమైన ప్రవేశ మార్గాలు లభిస్తున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.