
నర్సులు అనగానే ఠక్కున కేరళ వాళ్లు గుర్తుకొస్తారు.. అలాంటి కేరళ నర్సుల్లో మానవత్వం అదే స్థాయిలో ఉందని నిరూపించారు ఈ కేరళ నర్సులు ఇద్దరు. ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న వ్యక్తికి.. నడి రోడ్డుపై గుండెపోటు వచ్చి విలవిలలాడుతున్నాడు. ఈ విషయాన్ని బస్సులో ఉండి గమనించిన ఇద్దరు నర్సులు.. ఉన్న ఫళంగా బస్సు నుంచి కిందకు దూకారు. గుండెపోటు వచ్చిన వ్యక్తికి.. రోడ్డుపై CPR చేసి ప్రాణాలు నిలబెట్టారు. గుండెపోటుతో బాధపడుతున్న వ్యక్తిని అందరూ సినిమా చూసినట్లు చూస్తుంటే.. బస్సులో నుంచి చూసిన ఈ ఇద్దరు కేరళ నర్సులు.. మెరుపు వేగంతో బస్సు నుంచి కింద దూకి.. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు.. చనిపోతాను అనుకున్న వ్యక్తి.. బతికిన తర్వాత ఏమన్నాడో తెలుసా.. నా ప్రాణాలు కాపాడిన.. మీ కాళ్లు మొక్కచ్చు అని.. మిగతా వాళ్లు అందరూ ఇలా అంటున్నారు.. సెల్యూట్ సిస్టర్స్ అని..
ఎం జరిగిందంటే… బుధవారం ఉదయం కలడి వంతెన దగ్గరున్న ఎంసీ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓక్కల్ ప్రాంతంలో లాటరీ షాప్ నడుపుకునే సినోజ్ (43) అనే వ్యక్తి.. ఛాతీలో నొప్పి రావడంతో స్వయంగా కారు నడుపుకుంటూ హాస్పిటల్‌కు బయలుదేరాడు. కానీ ట్రాఫిక్ జామ్‌లో కారు నిలిచిపోవడంతో, నొప్పి ఎక్కువై కారులోనే స్పృహతప్పి పడిపోయాడు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న కేఎస్ఆర్టీసీ (KSRTC) బస్సులో అంజలి బైజు (అంగమాలి ఎల్ఎఫ్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్), ఆర్ద్ర రాజ్ (బెంగళూరు నర్సింగ్ విద్యార్థిని) ప్రయాణిస్తున్నారు. రోడ్డు పక్కన కారులో ఏదో తేడా జరగడాన్ని వీరు గమనించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఆ ఇద్దరూ.. వెంటనే కదులుతున్న బస్సులోంచి కిందకు దిగి, కారు దగ్గరకు పరుగెత్తారు.
►ALSO READ | వైరల్ సక్సెస్ స్టోరీ: ఒకప్పుడు జొమాటో డెలివరీ బాయ్.. ఇప్పుడు 2 ఏఐ స్టార్టప్ కంపెనీలకు ఓనర్
ఆసుపత్రికి వెళ్లేవరకూ
స్పృహలేకుండా ఉన్న సినోజ్‌ను చూసి వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేయడం ప్రారంభించారు. కారును హాస్పిటల్‌కు తీసుకెళ్లే దారిపొడవునా వాహనంలోనే అతనికి సీపీఆర్ చేస్తూనే ఉన్నారు. దింతో సినోజ్ హాస్పిటల్‌కు చేరుకునేసరికి కోలుకుంటున్న సంకేతాలు కనిపించాయని డాక్టర్లు చెప్పారు.
ఆసుపత్రిలో పరీక్షలు చేయగా, గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమని పూర్తిగా మూసుకుపోయినట్లు తెలిసింది. దీంతో డాక్టర్లు అతనికి అత్యవసరంగా యాంజియోప్లాస్టీ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అతనికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.