Reading Time: < 1 minute

బావా బామ్మర్దులకు ముఖం చెల్లలే.. అందుకే చర్చకు రాలే: కేటీఆర్, హరీష్ రావుపై మంత్రి జూపల్లి తీవ్ర విమర్శలు

Caption of Image.

తెలంగాణ అప్పులపై సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ అప్పలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. అన్నట్లుగానే శుక్రవారం (జులై 03) ప్రెస్ క్లబ్ కు వచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చర్చకు రావాలని సవాల్ విసిరిన ఆయన.. ప్రెస్ క్లబ్ కు చేరుకుని.. బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రెస్ క్లబ్ లో   కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వస్తారని మూడు కుర్చీలు వేశాను. కానీ వాళ్లకు ముఖం చెల్లలేదు. అందుకే చర్చకు రాలేదు. మరి ఇప్పుడు పారిపోయింది ఎవరు..? అంటూ ప్రశ్నించారు. 

మంత్రి జూపల్లి పూర్తి కామెంట్స్:

  • ఎవరు పారి పోయింది సిగ్గు, శరమ్ ఉండాలి
  • పాలమూరి పౌరుషం బరాబర్ ఉంది
  • సిగ్గు తప్పిన బతుకు మీరు బతుకుతున్నారు.
  • వాస్తవాలు  పక్కన బెట్టి కోట్లు ఖర్చు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు
  • మంత్రి పదవికి రాజీనామాకు కట్టుబడి ఉన్నాను
  • మీరు ఎందుకు కట్టుబడి లేరు
  • కేసీఆర్ తో చెప్పించండి నా లెక్కలు తప్పు అని 
  • ఉల్టా చోరు కొత్వాల్ కో డాట అన్నట్టు హరీష్ వైఖరి
  • నేను చెప్పిన లెక్కల్లో ఒక్క లెక్క తప్పైన రాజీనామా చేస్తా..
  • మాయమాటలు మోస పోవద్దు
  • సోషల్ మీడియా ప్రచారం చూసి నిజం అని నమ్మొదు
  • నిజం చెప్పేందుకు పౌరుషం ధైర్యం ఉండాలి
  • మీ మాట నిజం అయితే రాజీనామా చేస్తాం అని ఎందుకు చెప్పడం లేదు
©️ VIL Media Pvt Ltd.