
OPPO Enco Air5: ఒప్పో (OPPO) భారత మార్కెట్లో కొత్త ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ OPPO Enco Air5ను అధికారికంగా లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఇయర్‌బడ్స్‌లో 52dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), 54 గంటల వరకు ప్లేబ్యాక్ టైం, బ్లూటూత్ 6.1 కనెక్టివిటీ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. సరసమైన ధరలో ప్రీమియం ఆడియో అనుభవాన్ని అందించేందుకు ఈ డివైస్‌ను తీసుకవచ్చారు.
కొత్త డిజైన్:
డిజైన్ పరంగా చూస్తే.. Enco Air5 ఇయర్‌బడ్స్‌కు గత మోడల్‌తో పోలిస్తే కొత్తగా కొంచెం చతురస్రాకారంలో ఉండే వర్టికల్ ఛార్జింగ్ కేస్‌ను అందించారు. ఇయర్‌బడ్స్ తేలికపాటి బరువుతో ఉండటంతో ఎక్కువసేపు ధరించినా అసౌకర్యం కలగదని కంపెనీ చెబుతోంది. ఒక్కో ఇయర్‌బడ్ బరువు కేవలం 4.3 గ్రాములు మాత్రమే.
52dB ANC సపోర్ట్:
ఆడియో విభాగంలో 12mm టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్లు అందించారు. ఇవి క్లియర్ సౌండ్‌తో పాటు బలమైన బాస్‌ను అందిస్తాయి. అలాగే 5000Hz బ్యాండ్‌విడ్త్‌తో 52dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉండటంతో చుట్టుపక్కల శబ్దాలను గణనీయంగా తగ్గించి మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. అవసరమైనప్పుడు ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.
AI ఫీచర్స్:
కాల్ క్వాలిటీ కోసం ఒక్కో ఇయర్‌బడ్‌లో మూడు చొప్పున మొత్తం ఆరు మైక్రోఫోన్లు ఇచ్చారు. AI ఆధారిత కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తికి స్పష్టమైన వాయిస్ వినిపించేలా రూపొందించారు. అంతేకాకుండా AI Assistant, AI Translate వంటి స్మార్ట్ ఫీచర్లను కూడా ఇందులో అందించారు. ఎంపిక చేసిన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లతో ఉపయోగించినప్పుడు రియల్‌టైమ్ భాషా అనువాద సదుపాయం కూడా లభిస్తుంది.

కనెక్టివిటీ కోసం Bluetooth 6.1, SBC మరియు AAC కోడెక్‌లకు మద్దతు ఉంది. గూగుల్ ఫాస్ట్ పెయిర్, డ్యూయల్ డివైస్ కనెక్షన్, టచ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రాక్ మార్చడం, పాటలను ప్లే లేదా పాజ్ చేయడం, వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడం వంటి పనులను టచ్ కంట్రోల్స్ ద్వారా సులభంగా నిర్వహించవచ్చు.
54 గంటల బ్యాటరీ బ్యాకప్:
బ్యాటరీ విషయానికి వస్తే.. ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు ఇయర్‌బడ్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 13 గంటల వరకు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 54 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తాయి. ANC ఆన్‌లో ఉన్నప్పుడు ఇయర్‌బడ్స్ 6.5 గంటలు, కేస్‌తో కలిపి 27 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 11 గంటల వరకు సంగీతాన్ని ఆస్వాదించవచ్చని కంపెనీ పేర్కొంది. నీరు, చెమట నుంచి రక్షణ కోసం IP55 రేటింగ్‌ను అందించారు. దీంతో వర్కౌట్స్, ప్రయాణాలు లేదా రోజువారీ వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ధర:
OPPO Enco Air5 ఇయర్‌బడ్స్ లావెండర్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటి అసలు ధర రూ. 3,299 కాగా.. పరిమిత కాలం లాంచ్ ఆఫర్‌లో రూ. 3,099కే కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఇవి అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.