జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.
తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలు మొదలవుతాయి. ఎందుకంటే ఈ పండుగకు అంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలోనే గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు ఆ ప్రభావము అన్ని గ్రహాల మీద పడుతుంది. ఇంకా అదే సమయంలో కొత్త మార్పులు వస్తాయి. ఈ నెల 25 న తొలి ఏకాదశిని చేసుకోనున్నారు. రెండు రాశుల వారి జీవితాల్లోవెలుగులు రాబోతున్నాయి.
మకర రాశి : ఈ రాశివారికి మొత్తం అనుకూలంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉద్యోగం కల కూడా నేరువేరుతుంది. కొత్తగా వ్యాపారాలు మొదలు పెడతారు. వీళ్ళు ఇంట్లో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అన్నింటిలో శుభ ఫలితాలు పొందనున్నారు. ఇంకా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కోర్టు సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అధిక లాభాలు పొందుతారు
ధనుస్సు రాశి : ఈ రాశివారికి మంచిగా ఉండబోతోంది. మొత్తం అద్భుతంగా మారుతుంది. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉంటే సరిపోతోంది. ఆ ప్రయాణాల వల్ల జరగవు అని అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఇంకా ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. అలాగే, ఆర్థిక సమస్యలు కూడా మొత్తం పోతాయి. ఇంకా ఆకస్మిక లాభాలు వస్తాయి. మీకు ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. అలాగే, కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




