Reading Time: < 1 minute

సిద్ధాపూర్ ఎకో టౌన్ ప్రాజెక్టుకు.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Caption of Image.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ లో ఎకో టైన్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. 86 ఎకరాల ప్రభుత్వ భూమిలో జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో  ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. గురువారం జీవో జారీ చేసింది.  జపాన్ లోని కిటాక్యూషూ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం మేరకు ఈ ఎకో టౌన్ ప్రాజెక్టును అభివృద్ది చేస్తున్నారు. 

ALSO READ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్..

సర్క్యులర్ ఎకానమి, నెట్ జీరో లక్ష్యాల సాధన దిశగా  ఈ ప్రాజెక్టు కీలకం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం టీజీఐఐసీకి చెందిన 86 ఎకరాల భూమిని జీహెచ్ ఎంసీకి ప్రభుత్వం బదిలీ చేసింది. హెచ్ఐఎంఎస్ డబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో ఆధునిక వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి అనుమతిచ్చింది ప్రభుత్వం. తదుపరి చర్యలు చేపట్టాలని జీహెచ్ ఎంసీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

©️ VIL Media Pvt Ltd.