
హైదరాబాద్, జులై 3: హైదరాబాద్ జిల్లాలోని అన్ని ఈఆర్‌వో (ERO) కార్యాలయాలలో ఓటర్లు/పౌరులకు ప్రత్యేక సహాయం అందించేందుకు మొత్తం 16 హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి హెల్ప్ డెస్క్‌కు ఒక ఇన్‌చార్జిని నియమించారు. ఈ హెల్ప్ డెస్క్‌ల ద్వారా ఓటర్లు/పౌరులు SIR (Special Intensive Revision) ప్రక్రియలో చేయవలసినవి, చేయకూడనివి (Do’s & Don’ts), ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా పూరించాలి? తమ ఇంటికి సంబంధించిన ERO, AERO, BLO వివరాలను ఎలా తెలుసుకోవాలి? వంటి విషయాలను తెలుసుకోవచ్చు.
నియోజకవర్గాల వారీగా హెల్ప్ డెస్క్‌ల వివరాలు ఇవే..
- 57 – ముషీరాబాద్: మున్సిపల్ కార్యాలయం, దోమలగూడ.
- 58 – మలక్‌పేట్: మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ క్వార్టర్స్, బ్లాక్–B, 2, 4 & 5.
- 59 – అంబర్‌పేట్: మున్సిపల్ కార్యాలయం, 6వ అంతస్తు, అబిడ్స్ పార్కింగ్ కాంప్లెక్స్.
- 60 – ఖైరతాబాద్: మున్సిపల్ కార్యాలయం, 1వ అంతస్తు, ఖైరతాబాద్.
- 61 – జూబ్లీహిల్స్: మున్సిపల్ కార్యాలయం, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్.
- 62 – సనత్‌నగర్: మున్సిపల్ కార్యాలయం, హరిహర కళాభవన్.
- 63 – నాంపల్లి: మున్సిపల్ కార్యాలయం, సాయిబాబా దేవాలయం ఎదురుగా, గుడిమల్కాపూర్.
- 64 – కార్వాన్: మున్సిపల్ కార్యాలయం, 2వ అంతస్తు, ఖైరతాబాద్.
- 65 – గోషామహల్: మున్సిపల్ కార్యాలయం, 4వ అంతస్తు, అబిడ్స్ పార్కింగ్ కాంప్లెక్స్.
- 66 – చార్మినార్: మున్సిపల్ కార్యాలయం, మొఘల్‌పురా.
- 67 – చాంద్రాయణగుట్ట: మున్సిపల్ కార్యాలయం, జంగమెట్.
- 68 – యాకుత్‌పురా: మున్సిపల్ కార్యాలయం, ఫూల్‌బాగ్.
- 69 – బహదూర్‌పురా: మున్సిపల్ కార్యాలయం, ఫూల్‌బాగ్.
- 70 – సికింద్రాబాద్: మున్సిపల్ కార్యాలయం, సికింద్రాబాద్ కోర్టు పక్కన.
- 71 – కంటోన్మెంట్: సీఈఓ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం.
- జిల్లా ఎన్నికల అధికారి & కమిషనర్, జీహెచ్‌ఎంసీ కార్యాలయం: ట్యాంక్‌బండ్.