కరకరలాడే ఇడ్లీ పకోడా రెసిపీకి కావాల్సిన పదార్థాలు: 6 ఇడ్లీలు, ఒక కప్పు శనగపిండి, మూడు టేబుల్ బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, రెండు పచ్చిమిర్చిని తీసుకోవాలి.
కరకరలాడే ఇడ్లీ పకోడా రెసిపీకి కావాల్సిన పదార్థాలు : కొద్దిగా వంట సోడా , రుచికి సరిపడా ఉప్పు , సరిపడా నీరు, వీటిని వేయించడానికి సరిపడా నూనెను తీసుకోవాలి. ఇంకా దీనిలోకి పల్లీల పొడి తినాలకుంటే ఒక కప్పు పల్లీలు, నాలుగు ఎండుమిర్చిని తీసుకోవాలి. వీటితో పొడి చేసి ఇడ్లీ పకోడాతో తింటే టేస్టీగా ఉంటుంది
కరకరలాడే ఇడ్లీ పకోడా రెసిపీ తయారీ విధానం: ముందుగా ఇడ్లీలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరవాత ఒక గిన్నెలో కొద్దిగా శనగపిండి, ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి, ఇంకా కారం, కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలపండి.
కరకరలాడే ఇడ్లీ పకోడా రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : ఇంకా వీటిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పచ్చిమిర్చి, మూడు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి దీనిని బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో కొద్దికొద్దిగా నీరు పోస్తూ పిండిలాగా మంచిగా కలుపుకోవాలి.
ఇక చివర్లో కొద్దిగా వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి.
కరకరలాడే ఇడ్లీ పకోడా రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : ఇడ్లీ ముక్కలను తీసుకుని ఈ పిండిలో వేసి పాన్ లో ఆయిల్ వేసి అది వేడి చేసి మీడియం మంటపైన ఉంచాలి. ఇంకా ఈ ఇడ్లీ ముక్కలను రంగు మారే వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ఆ తరవాత టిష్యూ పేపర్‌పై మీద వేస్తే నూనె పోతోంది. ఇక మంచిగా తినొచ్చు




