
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు స్టార్ హీరోల సరసన గ్లామరస్ పాత్రల్లో నటించి మెప్పించిన కాజల్, ఇటీవల ‘సత్యభామ’ వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ పంథాలోకి అడుగుపెట్టింది. తాజాగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రం గురించిన ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారమవుతోంది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో ఒక ప్యాన్ ఇండియా లేడీ ఓరియెంటెడ్ సినిమా పట్టాలెక్కడానికి రెడీ అవుతుందట. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఒకవేళ ఈ వార్తలు నిజం అయితే టాలీవుడ్‌లో ఒక స్టార్ హీరోయిన్ నటించే ప్యాన్ ఇండియా లేడీ ఓరియెంటెడ్ చిత్రం రెండు భాగాలుగా రావడం ఇదే మొదటిసారి కానుంది.
కంప్లీట్‌గా మహిళా ప్రాధాన్యత కలిగిన పాత్రలో కాజల్ కనిపించబోతోందని, ఈ కథలో ఆమె క్యారెక్టరైజేషన్ ఎంతో విలక్షణంగా, మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని, కాజల్ ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో లాక్ అయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన, అలాగే దర్శకుడు, నిర్మాతలకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయని సమాచారం. ఈ విభిన్నమైన ప్రాజెక్ట్‌తో చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్ సరికొత్త మలుపు తిరగనుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.