Reading Time: < 1 minute

మామను గదిలో బంధించిన కోడలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో నర్సంపేటలో ఘటన

Caption of Image.

నర్సంపేట, వెలుగు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కోడలు తన మామను గదిలో నిర్బంధించిన ఘటన నర్సంపేట టౌన్‌‌లో మంగళవారం మధ్యాహ్నం కలకలం రేపింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేటకు చెందిన మోతె రంగారెడ్డి, కోడలు డాక్టర్ నవతి మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం నవతి.. మామ రంగారెడ్డి సెల్‌‌ఫోన్‌‌ను లాక్కొని, గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయింది. 

గదిలో ఊపిరాడక ఇబ్బంది పడడంతో రంగారెడ్డి కిటికీ నుంచి కేకలు వేయగా, స్థానికులు గమనించి బంధువులకు సమాచారం అందించారు. బంధువులు అక్కడికి చేరుకుని గది తాళం పగులగొట్టి రంగారెడ్డిని బయటకు తీసుకొచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.-

©️ VIL Media Pvt Ltd.