Reading Time: < 1 minute

హనీమూన్ ట్రిప్ లో భర్తను చంపిన కేసు..సోనమ్ బెయిల్ పై సుప్రీంకోర్టుకెక్కిన మేఘాలయ ప్రభుత్వం

Caption of Image.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హనీమూన్ ట్రిప్ హత్య కేసులో మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  హత్యకు గురైన రాజా రఘవంశీ భార్య సోనమ్ బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్ కొనసాగితే సోనమ్ దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని, నిందితురాలికి బెయిల్ మంజూరు చేయడంలో మేఘాలయ హైకోర్టు పొరపాటుపడిందని, తన పిటిషన్ వెంటనే విచారణ చేపట్టాలని మేఘాలయ సొలిసిటర్ జనరల్  సుప్రీంకోర్టును కోరారు. ఆయన వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు9 ఈ కేసును శుక్రవారం విచారించేందుకు అంగీకరించింది. 

సోనమ్ రఘువంశీని అరెస్ట్ కు సరైన కారణాలు చూపించకపోవడం వల్లే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని మెహతా అన్నారు. చట్టపరమైన నిబంధనలో ఒక అక్షర దోషం కారణంగా ఈ సమస్య తలెత్తిందని కోర్టుకు తెలిపారు. ఆమె బెయిల్‌పై కొనసాగితే పారిపోయే అవకాశం ఉందని, ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని మెహతా వాదించారు.

►ALSO READ | బెంగళూరులో ఘోర ప్రమాదం.. క్వారీలో బండరాయి పడి 7 వలస కార్మికులు మృతి!

రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు కూడా కోర్టు ను ఆశ్రయించేందుకు సిద్దమయ్యారు. హైకోర్టు ఇచ్చిన బెయిల్ తో తమ కుటుంబం సంతృప్తిగా లేదని, న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.  సోనమ్ చూసి సియా గోయల్ ఫుణెలో తనకు కాబోయే భర్తను చంపిందని, ఆమెను చూసి మహిళలు ఇలాంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, బెయిల్ మంజూరు చేస్తే మరింత రెచ్చిపోతారని అన్నారు. 

ఇదిలా ఉంటే.. జూన్ 29 సోనమ్ కు బెయిల్ చేసిన ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని మేఘాలయ హైకోర్టు సమర్థించింది.2025 మే 23న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ హత్యకు సంబంధించిన కేసు ఇది. మేఘాలయలోని సోహా ప్రాంతంలో రాజా రఘువంశీ అదృశ్యమై జూన్ 2 ఓ లోయలో శవంగా కనిపించాడు. పోలీసుల ప్రకారం.. రాజా రఘువంశీని కిరాయి హంతకులతో హత్య చేసేందుకు సోనమ్ ప్లాన్ చేసింది.డబ్బులకోసం రాజా రఘువంశీ హత్య చేసిందని దర్యాప్తు అధికారులు చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.