Reading Time: < 1 minute

దుమ్మురేపిన ఇండియన్ ప్లేయర్లు.. సెమీస్‌‌‌‌లో సెంథిల్‌‌‌‌, తన్వీ.. 

Caption of Image.

ముంబై: ఇండియా స్క్వాష్‌‌‌‌ ప్లేయర్లు సెంథిల్‌‌‌‌ కుమార్‌‌‌‌, తన్వీ ఖన్నా.. పీఎస్‌‌‌‌ఏ చాలెంజర్‌‌‌‌ టోర్నీలో సెమీస్‌‌‌‌లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లో సెంథిల్‌‌‌‌ 15–13, 11–4, 11–3తో నాలుగోసీడ్‌‌‌‌ అబ్దుల్లా హఫీజ్‌‌‌‌ (ఈజిప్ట్‌‌‌‌)పై గెలిచాడు. స్టార్టింగ్‌‌‌‌లో గట్టి పోటీ ఎదురైనా.. తర్వాతి రెండు గేమ్‌‌‌‌ల్లో ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ దుమ్మురేపాడు. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో యాసిన్‌‌‌‌ షోహిది (ఈజిప్ట్‌‌‌‌) 11–8, 11–8, 11–4తో టొమోటకా ఎండో (జపాన్‌‌‌‌)పై, సఫిక్‌‌‌‌ కమల్‌‌‌‌ (మలేసియా) 11–7, 6–11, 11–5, 11–8తో సలా ఎల్టోర్గామన్‌‌‌‌ (ఈజిప్ట్‌‌‌‌)పై, జైద్‌‌‌‌ ఇబ్రహీం 11–5, 11–13, 11–8, 8–11, 11–9తో ఓమ్‌‌‌‌ సమ్వాల్‌‌‌‌పై నెగ్గారు. విమెన్స్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో తన్వీ 11–6, 11–7, 8–11, 11–6తో జో ఫూ (జపాన్‌‌‌‌)ను ఓడించింది.

©️ VIL Media Pvt Ltd.