Reading Time: 2 minutes

లవర్‌తో అభిషేక్ శర్మ.. వైభవ్ రీపోస్ట్‌తో నెట్టింట రచ్చ రచ్చ!

Caption of Image.

Abhishek Sharma Girlfriend: భారత టీ20 జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ అగ్రెసివ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాలో చోటు కోసం వేచి చూస్తున్న 15 ఏళ్ల వైభవ్, మైదానం వెలుపల ఒక ఆసక్తికరమైన విషయంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు. అభిషేక్ శర్మ రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ లైలా ఫైసల్ పెట్టిన ఒక పోస్ట్‌ను వైభవ్ రీపోస్ట్ చేయడమే ఇందుకు కారణం.. బెంచ్‌కే పరిమితమైన సూర్యవంశీ, అభిషేక్ శర్మతో సరదాగా గడుపుతూ కనిపిస్తున్నాడు.

అభిషేక్ శర్మ, లైలా ఫైసల్ లవ్ రూమర్స్: 
అభిషేక్ శర్మ, లైలా ఫైసల్ మధ్య అఫైర్ నడుస్తోందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ, వీరిద్దరూ ఈ రూమర్లను ఎప్పుడు ఖండించలేదు.. అయితే వారి సోషల్ మీడియా యాక్టివిటీ వల్ల ఈ ఇద్దరూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. 2025లో అభిషేక్ ఆడిన మ్యాచ్‌లకు లైలా హాజరుకావడం, అలాగే అతనికి అత్యంత సన్నిహితులతో ఆమె కలిసి మెలిసి తిరగడంతో ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందనే వార్తలకు బలం చేకూరింది.

►ALSO READ | ఇంగ్లాండ్‌తో కాదు.. వర్షంతోనే భారత్ పోరు.. మాంచెస్టర్‌లో రేపు మ్యాచ్ జరిగేనా?

ఎవరీ లైలా ఫైసల్: 
2000 సంవత్సరంలో ఢిల్లీలో జన్మించిన లైలా ఫైసల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (RK పురం)లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత పైచదువుల కోసం యూకే (UK) వెళ్లిన ఆమె కింగ్స్ కాలేజ్ లండన్ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఫ్యాషన్ రంగంపై ఉన్న ఆసక్తితో యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్ లండన్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్, మార్కెటింగ్ కోర్సులు చేసింది. ప్రస్తుతం తన తల్లి రూహి ఫైసల్‌తో కలిసి LRF డిజైన్స్ అనే లగ్జరీ ఫ్యాషన్ హౌస్‌ను నడుపుతోంది. అంతేకాకుండా, తన తండ్రి స్థాపించిన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లగ్జరీ (హోమ్ థియేటర్ కంపెనీ) కి సీఓఓ (COO) గా కూడా కొనసాగుతుంది. 

చరిత్ర సృష్టించేందుకు వైభవ్ రెడీ: 
ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టులో ఓపెనింగ్ స్లాట్ కోసం అభిషేక్, వైభవ్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. అయితే, ఇటీవల సంజు శాంసన్, ఇషాన్ కిషన్లు వరుసగా విఫలం కావడంతో, త్వరలోనే జరగబోయే మ్యాచ్‌లలో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ గనుక భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం (Debut) చేస్తే.. వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.

©️ VIL Media Pvt Ltd.