Reading Time: < 1 minute
Tgpsc Seed Certification Officer Recruitment 2026

TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్ర సీడ్ & ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ‘సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్’ (రాష్ట్ర స్థాయి) పోస్టుల భర్తీకి సరికొత్త జనరల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ (నెం: 03/OG/SD/2026) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుండి రూ. 1,27,310 వరకు వేతన శ్రేణి ఉంటుంది. అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 7, 2026 నుండి ఆగస్టు 12, 2026 వరకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జూలై 1, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యా అర్హతల విషయానికి వస్తే.. అభ్యర్థులు ఐసీఏఆర్ (ICAR) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్‌లో బేసిక్ డిగ్రీ (బీఎస్సీ అగ్రికల్చర్) పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రానమీ, ప్లాంట్ ఫిజియాలజీ విభాగాలలో ఏదో ఒకదానిలో ఎంఎస్సీ అగ్రికల్చర్—M.Sc.(Ag.) పీజీ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. విద్యార్హతలు , ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.