Reading Time: < 1 minute
అక్కడ ఫ్రీ బిర్యానీ ఆఫర్.. పొట్లాల కోసం ఎగబడ్డ జనం..! పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

వరంగల్‌, జులై 2: హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉచిత బిర్యాని పంపిణీ చేస్తున్నామనే ప్రకటన అక్కడ ఊహించని ఉద్రిక్తతకు కారణం అయ్యింది. 300 ప్యాకెట్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. కానీ జనం వెయ్యిమందిపైగా అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఉచిత బిర్యానీ పొట్లాల కోసం జనం పోటెత్తారు. తోపులాట జరిగింది.. చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంది. హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ సర్కిల్ లో సురభి హోటల్ నిర్వాహకులు సురభి ఫుడ్ కోర్ట్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రారంభోత్సవ కానుకగా 300 మందికి ఉచితంగా బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. ఈ ప్రకటన చూసిన జనం ఒక్కసారిగా పోటెత్తారు.

ఫుడ్ కోర్ట్ ఓపెనింగ్ గెస్ట్ స్థానిక ఎమ్మెల్యే వచ్చి వెళ్ళిన కొద్దిసేపటికే జనం పోటెత్తారు. బిర్యాని ప్యాకెట్లు పంపిణీచేసే సమయానికి సుమారు వెయ్యి మంది వరకు చేరుకున్నారు. అసలే చిన్న గల్లీ..! ఇంతఉంది జనమంతా ఒక్కసారిగా ఏగపడడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉచితంగా 300 బిర్యానీ ప్యాకెట్లు పంచుతామని ప్రచారం చేసిన నిర్వాహకులు ప్రచారానికి తగ్గ ఏర్పాట్లు చేయలేకపోయారు. దీంతో గందరగోళం ఏర్పడింది. బిర్యానీ పొట్లాల కోసం పోటెత్తిన జనం తోపులాట జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడడంతో ఆ బీట్ కానిస్టేబుల్స్ రంగంలొకి దిగి అక్కడ ఉద్రిక్తత చల్లారేలా చేశారు.