
దక్షిణాదిలో ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి. చెన్నై-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో మార్కింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఏరియల్ సర్వే పూర్తికాగా, ప్రస్తుతం సాధ్యాసాధ్యాల అధ్యయనంలో భాగంగా రూట్‌ను ఖరారు చేసేందుకు రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో సర్వే బృందాలు రంగంలోకి దిగాయి. గత పది రోజులుగా హైదరాబాద్-చెన్నై కారిడార్ కోసం శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా.. అలాగే హైదరాబాద్-బెంగళూరు కారిడార్ కోసం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోంది. పొలాలు, ఖాళీ స్థలాల్లో ఎరుపు, తెలుపు రంగులతో ప్రత్యేక మార్కింగ్‌లు వేస్తున్నారు. యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మల్కిస్‌గూడెం, చింతపట్ల, గౌరెల్లి తదితర గ్రామాల్లో ఇప్పటికే మార్కింగ్ ప్రక్రియ పూర్తయింది. కారిడార్ అలైన్‌మెంట్, సర్వే పాయింట్లు, ప్రాజెక్టుకు అవసరమయ్యే భూసేకరణ అంచనాల కోసమే ఈ పనులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ గ్రౌండ్ సర్వే పూర్తిగా ముగిసిన తర్వాతే తుది అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ స్టేషన్ల వివరాలు, భూసేకరణపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే మూడు మెట్రో నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Maharashtra: గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు