Reading Time: < 1 minute

పని ఇప్పిస్తానని మహిళను తీసుకెళ్లి… బంగారం లాక్కొని బావిలో తోసేశాడు… 24 గంటలు బావిలోనే…

Caption of Image.

కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ లో దారుణం జరిగింది. పని ఇప్పిస్తానని చెప్పి మహిళను తీసుకెళ్లి ఆమె నుంచి బంగారం లాక్కొని బావిలో తోసేశాడు దుండగుడు. గురువారం ( జులై 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నుసుల్తానాపూర్ గ్రామంలో జరిగింది ఈ దారుణ ఘటన. కిసాన్ పూర్ కి చెందిన గంగాధర లక్ష్మి అనే మహిళకు పని ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి బంగారం లాక్కొని బావిలో తోసేశాడు దుండగుడు. దీంతో సుమారు 24 గంటలపాటు బావిలోనే నరకయాతన అనుభవించింది బాధితురాలు.

ఇవాళ ఉదయం బావిలో ఉన్న బాధితురాలిని గుర్తించాడు బావి యజమాని. స్థానికులతో కలిసి తాళ్లు, మంచం సహాయంతో మహిళను బయటకు తీశారు. బాధితురాలు కరీంనగర్ కిసాన్ నగర్‌కు చెందిన మహిళగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. 

©️ VIL Media Pvt Ltd.