Reading Time: < 1 minute
రెండు లారీలు ఢీ.. నలుగురి సజీవదహనం! ఇలాంటి ఘటన మీ జీవితంలో చూసి ఉండరు.. భయానక దృశ్యాలు..

అప్పుడప్పుడే తెల్లవారుతోంది.. జాతీయ రహదారిపై వాహనాలు దూసుకుపోతున్నాయి. అంతలోనే ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద డ్రైవర్ తప్పిదంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొనడంతో నలుగురు సజీవ దహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి మృతదేహాలను మార్చురీకి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై నుండి గుంటూరు వైపు నాపరాళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోయపాలెం వద్దకు వచ్చే సరికి ఎదురుగా ఉన్న లారీ కనిపించింది. దీంతో డ్రైవర్ ప్రమాదాన్ని నివారించేందుకు ఒక్కసారిగా రైట్ సైడ్‌కు లారీని తిప్పాడు. దీంతో లారీ అదుపుతప్పి డివైడర్ ను డీ కొట్టి అటు వైపు వస్తున్న లారీని ఎదురుగా ఢీ కొట్టింది. గుంటూరు నుండి చెన్నై వైపు పేపర్ల లోడ్‌తో వెళ్తున్న లారీని నాపరాళ్ల లోడ్ తో వస్తున్న లారీ ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొనడంతో డ్రైవర్లతో పాటు క్లీనర్స్ కూడా క్యాబిన్ లో ఇరుక్కుపోయారు. కిందకు దిగే అవకాశం లేకపోవడం మరొకవైపు డిజీల్ చిమ్మడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో నలుగురు సజీవ దహనం అయ్యారు. ప్రమాదం గురించి తెలిసి రోడ్డుపైకి వచ్చిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే క్యాబిన్స్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్లు స్థానికులు చూస్తుండగానే మంటల్లో కాలిపోయారు. ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వేగంగా వస్తున్న నాపరాళ్ల లారీ డ్రైవర్ అదుపుతప్పడంతోనే ఘోర ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. నాలుగు మృతదేహాలను మార్చురికీ తరలించారు. లారీ యజమానులను గుర్తించి వారిచ్చిన సమాచారంతో మృతుల వివరాలు గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి