
సముద్ర నావికులు.. ఒకసారి ఇంటి నుంచి బయటికి వెళ్తే.. తిరిగొచ్చేదాక నమ్మకం ఉండదు.. అలాంటి సాహసోపేతమైన జాబ్.నెలలు..నెలలుగా సముద్రంలోనే ఉండాలి. కేవలం వీళ్లు నావికులే కాదు.. ప్రపంచ ఆర్థికవ్యవస్థను నడిపించే శ్రామికులు. అలాంటి నావికులు అమెరికా, ఇరాన్ యుద్దం కారణంగా హార్ముజ్ లో ఓడలు చిక్కుకుపోయి మృత్యువుతో పోరాటం చేశారు. కొందరు బయటపడ్డారు. కొందరు బలయ్యారు. ఇంకా చాలామంది ఇప్పటికీ హార్ముజ్ జలసంధిలో చిక్కుకుని ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పంద అమలులో ఉన్నప్పటికీ నౌకాయానం నిలిపివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన దాదాపు 8వేల మంది నావికులు హార్ముజ్ లో నడి సంద్రంలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్నారు. వారికి రక్షించేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ(IMO) విశ్వప్రయత్నాలు చేస్తోంది.
IMO రిపోర్టు ప్రకారం..హార్ముజ్ జలసంధింలోని దాదాపు8వేల మంది నావికులు గల్ఫ్ లో చిక్కుకుపోయారు. క్షిపణులు, డ్రోన్లు వారి తలలపై నుంచి దూసుకుపోతుందటే నౌకల సేవలో శ్రమిస్తున్నారు. భౌగోళిక రాజకీయ శక్తులు, దౌత్యపరమైన చర్చలపైనే వారి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. నిరంతరం వ్యాపారం సాగేలా ఊహించని ప్రమాదాలను ఎదుర్కొనే ఈ శ్రామికులపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందన్న విషయం సుష్పష్టం.
►ALSO READ | అలీ ఖమేనీ అంత్యక్రియలకు 4 నెలలు ఎందుకు ఆగారు.. ఇన్నాళ్లు ఆయన భౌతికకాయాన్ని ఎక్కడ ఉంచారు..?
ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా జరిగే సరుకు రవాణాలో 80 శాతానికి పైగా సముద్రనౌకల ద్వారానే జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 85 వేల నౌకల ద్వారా వాణిజ్యం సాగుతోంది. ఈ నౌకలలో 26 లక్షల మంది నావికులు సేవలందిస్తున్నారు. వీరిలో ఆసియానుంచి అధిక శాతం తక్కువ ఆదాయం గల దేశాలనుంచే ఉన్నారు. ప్రపంచ కార్మిక శక్తిలో దాదాపు 30 శాతం మంది పిలిప్పీన్స్, భారత్ నుంచే ఉంది.
సముద్రంలో ఓడలపై పనిచేయడమంటే కత్తిమీద సాములాంటిది. ప్రమాదకరం కూడా. సిబ్బంది నెలల తరబడి ఇంటికి దూరంగా ఉంటారు. సముద్రంలో నావికుల పరిస్థితి. వీరికి పని, సంక్షేమం హక్కులు ఉన్నప్పటికీ అమలు విధానమే అధ్వాన్నంగా ఉందని చెబుతున్నారు. మారిటైమ్ లేబర్ కన్వెన్షన్ ద్వారా వీరి హక్కులకు భద్రత కల్పిస్తారు. ప్రమాదకర పరిస్థితులలో రక్షణ కల్పిస్తుంది.
కానీ షిప్పింగ్ వంటి వికేంద్రీకృత ప్రపంచ పరిశ్రమలో, అమలు ,నిబంధనల పాటింపు అస్తవ్యస్తంగా ఉంటుంది. పెద్ద ఓడల యజమానులు తరచుగా నిబంధనలను పాటిస్తారు. కానీ చిన్న కంపెనీల యాజమాన్యంలోని ఓడలలోని నావికులకు కనీస హక్కులు కూడా అందించవు అని సహాయక బృందాల ఉన్నతాధికారులు చెబుతున్నారు.
హార్ముజ్ లో ప్రస్తుత పరిస్థితి గురించి భారతీయ నావికుడు చోప్రా తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ.. డ్యూటీలో నెలల తరబడి సముద్రంలో ఉంటున్నాం.. ప్రపంచానికి వస్తువుల రవాణా, ఆర్థిక వ్యవస్థ అన్నీ ఈ సముద్ర యాన ఉద్యోగంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు.
హార్ముజ్ లో ప్రస్తుత పరిస్థితులపై అంతర్జాతీయ సముద్ర సంస్థ తీవ్రంగా స్పందించింది. సముద్రయాన సిబ్బంది ఎన్నడూ భౌగోళిక రాజకీయ సంఘర్షణకు బాధితులు కాకూడదు.. ఎర్ర సముద్రంలో అయినా, నల్ల సముద్రంలో అయినా, హోర్ముజ్ జలసంధిలో అయినా, ఇతర సవాలుతో కూడిన ప్రాంతాలలో అయినా, ప్రతి ఓడ సరుకును మాత్రమే కాకుండా ప్రజలను కూడా తీసుకువెళుతుందని గుర్తుంచుకోవాలని సూచిస్తోంది.