Reading Time: < 1 minute

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో  ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌ లోకి

Caption of Image.

దుబాయ్‌‌‌‌: టీమిండియా వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌, బ్యాటర్‌‌‌‌ ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (876).. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌లో నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌కు చేరాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ శర్మ (869)ను వెనక్కి నెట్టి ఇషాన్‌‌‌‌ టాప్‌‌‌‌లోకి దూసుకొచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ 200 స్ట్రయిక్‌‌‌‌ రేట్‌‌‌‌తో 317 రన్స్‌‌‌‌ చేశాడు. ఓవరాల్‌‌‌‌గా టీ20 క్రికెట్‌‌‌‌లో నంబర్‌‌‌‌వన్‌‌‌‌కు చేరుకున్న నాలుగో ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా ఇషాన్‌‌‌‌ రికార్డులకెక్కాడు. 

గతంలో కోహ్లీ, సూర్యకుమార్‌‌‌‌, అభిషేక్‌‌‌‌ ఈ ఫీట్‌‌‌‌ సాధించారు. తిలక్‌‌‌‌ వర్మ (747), సూర్యకుమార్‌‌‌‌ (708) వరుసగా ఆరు, ఎనిమిదో ర్యాంక్‌‌‌‌ల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌‌‌‌లో వరుణ్‌‌‌‌ చక్రవర్తి (725), జస్ప్రీత్‌‌‌‌ బుమ్రా (688) మూడు, ఆరో ర్యాంక్‌‌‌‌ల్లో ఉన్నారు. 

టెస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌లో ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌ టాప్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌లోకి దూసుకురాగా, శుభ్‌‌‌‌మన్ గిల్‌‌‌‌ ఆరో ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. యశస్వి జైస్వాల్‌‌‌‌ ఒక్క స్థానం దిగజారి 9వ ర్యాంక్‌‌‌‌లో నిలిచాడు. బౌలింగ్‌‌‌‌లో బుమ్రా నంబర్‌‌‌‌వన్‌‌‌‌గా కొనసాగుతున్నాడు.

©️ VIL Media Pvt Ltd.