
టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె మోహన , తోట చంద్రశేఖర్ కుమారుడు అనిరుధ్ ల వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కన్వేన్సన్ సెంటర్ లో అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మోహన్ రమేష్ . మోహన, అనిరుధ్ ల వివాహానికి మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు, విక్టరీ వెంకటేష్, దర్శకులు వీవీ వినాయక్, వీర శంకర్, శ్రీను వైట్ల, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీద్, బన్నీవాసు, కోన వెంకట్, నటుడు మురళీమోహన్, ప్రభుదేవా తదితరలు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.
Megastar @KChiruTweets garu graced the wedding reception of Director #MeherRamesh ’s Daughter and blessed the couple ❤️#Chiranjeevi pic.twitter.com/8tomO6Ybxo
— Rishi (@Rishi_JanaSena) July 1, 2026
అటు రాజకీయ ప్రముఖులలో ఏపీ డిప్యూటీ సీఎం రఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రులు, గంటా శ్రీనివాసరావు, అంబటి రాంబాబు వంటి రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులకు ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Victory @VenkyMama graced the grand wedding reception of director @MeherRamesh‘s daughter, #KrishnaMohana, and Anirudh. pic.twitter.com/LWtVExesN9
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 1, 2026